Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimecc1ef13a-58bc-40ad-b4c1-396554124db3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimecc1ef13a-58bc-40ad-b4c1-396554124db3-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువ అయ్యాయి. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలకంటే.. ప్రేమ వివాహాలనే చేసుకోవడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా.. లేదంటే ప్రాణం తీస్తా అని సినిమా డైలాగులు నేటి యువతకు బాగా ఒంటిపట్టినట్టున్నాయి. కొందరు యువతులను బెదిరిస్తూ ప్రేమించమంటూ వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు యువకులు. మరికొందరు ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులను నిలువునా మోసం చేస్తూ వారిని దారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రేమించమని కొందరు యువకులు అమ్మాయిల వెంటపడితే..crime;women;prema;gujarat - gandhinagar;cinema;police;marriage;love;october;woman;girl;murder.;local languageఅమ్మో : చంపేసి గోడ కట్టేశాడు.. అచ్చం సినిమాలోలానేఅమ్మో : చంపేసి గోడ కట్టేశాడు.. అచ్చం సినిమాలోలానేcrime;women;prema;gujarat - gandhinagar;cinema;police;marriage;love;october;woman;girl;murder.;local languageSat, 16 Jan 2021 16:53:01 GMTప్రేమ వివాహాలు ఎక్కువ అయ్యాయి. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలకంటే.. ప్రేమ వివాహాలనే చేసుకోవడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా.. లేదంటే ప్రాణం తీస్తా అని సినిమా డైలాగులు నేటి యువతకు బాగా ఒంటిపట్టినట్టున్నాయి. కొందరు యువతులను బెదిరిస్తూ ప్రేమించమంటూ వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు యువకులు. మరికొందరు ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులను నిలువునా మోసం చేస్తూ వారిని దారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రేమించమని కొందరు యువకులు అమ్మాయిల వెంటపడితే.. మరికొందరేమో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఓ దారుణ ఘటనే మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు, యువతీ(32) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ యువతితో యువకుడు ఐదేండ్లుగా సహజీవనం చేశాడు.

దాంతో  ఆ సదరు యువతి అతన్ని పెళ్లి చేసుకోమ్మని అడిగింది. దాంతో ఆ యువకుడు అతిదారుణంగా తన ప్రేమను సైతం మర్చిపోయి తన ప్రేయసిని హత్య చేశారు.  అచ్చం సినిమాలోలాగే ఈ దారుణం బయట ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోని గోడలో శవాన్ని దాచాడు. అదే ఇంట్లో ఆ యువకుడు గత మూడు నెలలుగా నివసిస్తున్నాడు.. పూర్తి వివరాళ్లోకి వెళితే.. పాల్ గఢ్ జిల్లాలోని వనగామ్ లో నిందితుడు ఓ మహిళను ప్రేమించాడు. ఆమెతో 5 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కాగా ఈ మహిళ మూడు నెలలుగా కనిపించడం లేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిందితుడిని.. మా అమ్మాయి ఎక్కడా అని అడిగారు.. దానికి నిందితుడు పనిమీద గుజరాత్ లోని వాపికి వెళ్లింది.. తొందరలోనే తిరిగి వస్తుందని అబద్దం చెప్పాడు. కానీ ఆమె రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

 దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు చెప్పిన సమాధానాలు ఏ ఒక్కటి కూడా పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు ఆరా తీశారు. దాంతో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినందుకే ఆమెను హత్య చేసి గోడలో దాచి పెట్టినట్టు నిందితుడు పోలీసులకు వెళ్లడించాడు. దాంతో పోలీసులు ఆ గోడను తొవ్వి ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీసారు. కానీ అప్పటికే ఆ మృతదేహం పూర్తిగా అస్థిపంజరంలా మారిందని పోలీసులు తెలిపారు. కాగా ఆమెను అక్టోబర్ 21 రోజునే చివరి సారిగా కనిపించిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడిపై పలు సెక్షన్లు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.




వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాంతులు... ఏమైనా అవుతుందా....?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>