BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/hair-dry6463e93d-ed65-47dc-aa39-93b81e567f66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/hair-dry6463e93d-ed65-47dc-aa39-93b81e567f66-415x250-IndiaHerald.jpgప్రస్తుతకాలంలో సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు జుట్టుకు డై వేసుకుంటున్నారు. ఇందుకు కారణం వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు తెల్లబడడం. వారు తీసుకునే ఆహారలోపం అయినా కావచ్చు లేదా వాతావరణంలో కలిగే మార్పుల వల్ల అయినా కావచ్చు. అది మన శరీరం పైన ఎంత ప్రభావం చూపిస్తుందో అలాగే తలలో వెంట్రుకల పైన కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఏ వయస్సు వారికైనా జుట్టు త్వరగా తెల్లబడిపోతోంది. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి తలకు రంగు వేయడం లాంటివి చేస్తున్నారు.అయితే ఈ రంగులు వేసుకునేటప్పుడు తీhair,dryతలకు డై వేస్తున్నారా? అయితే జాగ్రత్త సుమా!తలకు డై వేస్తున్నారా? అయితే జాగ్రత్త సుమా!hair,dryFri, 15 Jan 2021 10:25:00 GMTప్రస్తుతకాలంలో సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు జుట్టుకు డై వేసుకుంటున్నారు. ఇందుకు కారణం వయస్సుతో సంబంధం లేకుండా  అందరికీ జుట్టు తెల్లబడడం. వారు తీసుకునే ఆహారలోపం  అయినా కావచ్చు లేదా వాతావరణంలో కలిగే మార్పుల వల్ల అయినా కావచ్చు. అది మన శరీరం పైన ఎంత ప్రభావం చూపిస్తుందో అలాగే తలలో వెంట్రుకల పైన  కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఏ వయస్సు  వారికైనా జుట్టు త్వరగా తెల్లబడిపోతోంది. తెల్లజుట్టును  నల్లగా మార్చడానికి తలకు రంగు వేయడం లాంటివి చేస్తున్నారు.అయితే ఈ రంగులు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ముందుగా  తెలుసుకోవాలి. సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మ సంబంధిత వ్యాధులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా తలకు రంగు వేసుకునేటప్పుడు కేవలం మీ వెంట్రుకలు మాత్రమే రంగు తగిలేలాగా చేసుకోవాలి. ఒకవేళ చర్మానికి తగిలితే, వెంటనే మంచి నీళ్లతో కడిగేసుకోండి. లేదంటే చర్మం మీద ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా.

జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు ముందుగా ముఖానికి, చేతులకు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెను రాసుకున్న  తర్వాత  మాత్రమే డై వేసుకోవాలి.

తలంటు పోసుకునేటప్పుడు కూడా రంగు చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా కళ్ళు, ముక్కు లాంటి సున్నితమైన ప్రదేశాలకు ఈ డై తగలకుండా జాగ్రత్త పడాలి.

నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడకూడదు. డై  ఎంచుకునేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జుట్టు నుంచి మంచి సువాసన రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరం తలలో  మాడుకు, జుట్టుకు తగలకుండా జాగ్రత్త పడితే మంచిది. లేదంటే వీటిలో ఉండే ఎక్కువ సాంద్రత కలిగిన రసాయనాలు కుదుళ్లను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫలితంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి  డై వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు.




వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>