PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya07e83e59-2085-45ac-91ae-b6b362049d1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya07e83e59-2085-45ac-91ae-b6b362049d1b-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మరికొందరి పేర్లు చేర్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ఏ వన్ నిందితురాలుగా ఉన్నారు. ఆమె భర్త భార్గవ రామ్ ఏ3 నిందితుడుగా ఉన్నారు. అయితే తాజాగా భార్గవ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని చేర్చిన ఈ కేసులో పోలీసులు నిందితులుగా చేర్చినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ తర్వాత భార్గవ్‌రామ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పోలీసులు ఇంకా వెదుకుతున్నారు. అయితే ఈ కిడ్నాప్ ప్లాన్ నుండి నిందితులు పారిపోయేంakhilapriya;praveen;ram pothineni;tiru;telangana;police;bhuma akhila priya;minister;husbandషాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?akhilapriya;praveen;ram pothineni;tiru;telangana;police;bhuma akhila priya;minister;husbandFri, 15 Jan 2021 08:00:00 GMTమంత్రి అఖిలప్రియ ఏ వన్ నిందితురాలుగా ఉన్నారు. ఆమె భర్త భార్గవ రామ్ ఏ3 నిందితుడుగా ఉన్నారు. అయితే తాజాగా భార్గవ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని చేర్చిన ఈ కేసులో పోలీసులు నిందితులుగా చేర్చినట్టు తెలుస్తోంది.

కిడ్నాప్ తర్వాత భార్గవ్‌రామ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పోలీసులు ఇంకా వెదుకుతున్నారు. అయితే ఈ కిడ్నాప్ ప్లాన్ నుండి నిందితులు పారిపోయేందుకు భార్గవ్‌ రామ్‌ తమ్ముడు.  అఖిల ప్రియ మరిది చంద్రహాస్‌, భార్గవ్‌ రామ్ తల్లి, అఖిల ప్రియ అత్తగారు కిరణ్మయి కూడా సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఈ కేసులో పోలీసులు వారిని కూడా నిందితులుగా చేర్చారు.

త్వరలో పోలీసులు భార్గవ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇక భార్గవ్‌ రామ్ ఇంకా పోలీసుల చేతికి చిక్కపోయినా.. అతని ఆచూకీ తెలిసింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని కీలక అనుచరుడు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం ఆ కిడ్నాప్‌ పథకం మొత్తం భార్గవ్‌ రామ్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేశాడట. కిడ్నాప్‌ పూర్తయిన తర్వాత తర్వాత భార్గవ్ రామ్ కిడ్నాపర్లకు చెప్పినట్టుగా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ చేరుకున్నాడట. అక్కడే  ప్రవీణ్‌, నవీన్ లతో భార్గవ్‌రామ్‌ సంతకాలు చేయించారట.

ప్రవీణ్ రావు, నవీన్‌ తో సంతకాలు తీసుకున్న తర్వాత.. భార్గవ్‌ రామ్‌, మాదాల శీను ఇద్దరూ తెలంగాణ విడిచిపోయేందుకు ప్రయత్నించారు. వారిద్దరూ కొంత దూరం కలిసి ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిలో భార్గవ్‌ రామ్ మహారాష్ట్రకు, శీను కర్ణాటకకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని గంటల తర్వాత వారు తమ సిమ్‌ కార్డులు పారేశారట. వారి ఆచూకీకి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.




డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>