PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/bhuma-akhilapriya-jagatvikhyatreddy-bhargav261c5f1c-f5c4-4d42-9a1c-1c6a548d3ab4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/bhuma-akhilapriya-jagatvikhyatreddy-bhargav261c5f1c-f5c4-4d42-9a1c-1c6a548d3ab4-415x250-IndiaHerald.jpgబోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్‌లో భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తాన్ని పోలీసులు చేర్చారు. కిడ్నాప్‌ తతాంగంలో భార్గవ్ ఫ్యామిలీ కూడా సాయం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో భార్గవ్ పేరెంట్స్, తమ్ముడు చంద్రహాస్, బావమరిది భూమా జగత్‌‌ విఖ్యాత్ పేర్లను ఎక్కించారు. అయితే, కిడ్నాప్‌ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు.. వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాతakhila;akshay kumar;kumaar;akshay;hosta;cinema;police;bhuma akhila priya;driver;bowenpallyబోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో మ‌రో సంచ‌ల‌నం...బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో మ‌రో సంచ‌ల‌నం...akhila;akshay kumar;kumaar;akshay;hosta;cinema;police;bhuma akhila priya;driver;bowenpallyFri, 15 Jan 2021 07:15:12 GMTబోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్‌లో భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తాన్ని పోలీసులు చేర్చారు. కిడ్నాప్‌ తతాంగంలో భార్గవ్ ఫ్యామిలీ కూడా సాయం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో భార్గవ్ పేరెంట్స్, తమ్ముడు చంద్రహాస్, బావమరిది భూమా జగత్‌‌ విఖ్యాత్ పేర్లను ఎక్కించారు. అయితే, కిడ్నాప్‌ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు.. వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో  జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.


జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. దీంతో ఆమెకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కిడ్నాప్‌నకు సంబంధించిన యాక్షన్‌పై అఖిలప్రియ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా తరహాలో కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన అఖిలప్రియ.. అక్షయ్ కుమార్ నటించిన సినిమాను చూపెట్టినట్లు విచారణలో తెలిపింది. అంతేగాక ఐటీ అధికారులుగా ఎలా నటించాలన్న దానిపై వారంరోజుల పాటు భార్గవ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చారు. ఇదంతా యాసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్లో జరిగిందని అఖిలప్రియ పోలీసులకు మంగళవారం వెల్లడించింది. శ్రీనగర్‌కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ డ్రెస్సులు, ఐడీ కార్డులను అద్దెకు తీసుకొని కిడ్నాప్‌ సమయంలో ఉపయోగించారు.


డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>