PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vamsi8e8fe8be-702d-47e4-8f15-ef8287388737-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vamsi8e8fe8be-702d-47e4-8f15-ef8287388737-415x250-IndiaHerald.jpgఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వంశీని టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వైసీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న వీరిద్ద‌రూ ఏదో ఒక ర‌కంగా పొగ‌బెట్టి వంశీని ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు సోష‌ల్ మీడియాను వాడుతున్నారు. త‌మ అనుచ‌రుల ద్వారా దుట్టా, యార్ల‌గ‌డ్డ‌లు.. వంశీని తీవ్ర‌స్థాయిలో ఇరుకున పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌గా ఉన్నందున ఓట్లేసి గెలిపించాం.. ఇప్పుడు వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు క‌నుక మీ ప‌ద‌వికి రాజీనామా చేసి, త‌ర్వాత vamsi;thirtha;vamsi;krishna river;రాజీనామా;district;media;mla;episode;krishna district;letter;tdp;ycpవంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?vamsi;thirtha;vamsi;krishna river;రాజీనామా;district;media;mla;episode;krishna district;letter;tdp;ycpFri, 15 Jan 2021 10:14:00 GMTరాజ‌కీయ నేత‌ల‌కు ఒక‌టి వ‌దిలితే ఒక్క స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతూనే ఉంటుంది. అలానే ఇప్పుడు కృష్ణా జిల్లా గ‌న్న‌వరం నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచి.. త‌ర్వాత కాలంలో వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ వ్య‌వ‌హారం కూడా అచ్చు ఇలానే ఉంద‌ని అంటున్నారు. టీడీపీలో ఉండ‌గా.. గుర్తింపు లేద‌ని ఆవేద‌న చెందిన వంశీ.. ఏం ఆశించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో తెలియ‌దు కానీ.. ఆయ‌న‌కు ఈ పార్టీలో అడుగ‌డుగునా వివాదాలే ఎదుర‌వుతున్నాయి. ఎవ‌రూ ఆయ‌న‌తో క‌లిసి రావ‌డం లేదు.

స‌రే.. ఇక్క‌డ వివాదాల్లో గ‌త కొన్నాళ్లుగా త‌ల‌మున‌క‌లుగా ఉన్న వంశీకి ఇప్పుడు మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. నిన్న మొన్న‌టివ‌ర‌కు కేవ‌లం ఆధిప‌త్య ధోర‌ణికే ప‌రిమిత‌మైన వైసీపీ నాయ‌కులు దుట్టా రామ‌చంద్రరావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావులు.. ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వంశీని టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వైసీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న వీరిద్ద‌రూ ఏదో ఒక ర‌కంగా పొగ‌బెట్టి వంశీని ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు సోష‌ల్ మీడియాను వాడుతున్నారు.

త‌మ అనుచ‌రుల ద్వారా దుట్టా, యార్ల‌గ‌డ్డ‌లు.. వంశీని తీవ్ర‌స్థాయిలో ఇరుకున పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌గా ఉన్నందున ఓట్లేసి గెలిపించాం.. ఇప్పుడు వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు క‌నుక మీ ప‌ద‌వికి రాజీనామా చేసి, త‌ర్వాత మ‌ళ్లీ పోటీ చేయండి.. అంటూ.. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో వంశీని ఏకేస్తున్నారు. అంతేకాదు.. రాజ‌కీయాల్లో నిబ‌ద్ధ‌త అనేది ఉంటే..వెంట‌నే ఈ ప‌ద‌విని వ‌దిలేసి.. వైసీపీలో చేరాల‌ని కూడా కామెంట్లు వ‌స్తుండడం గ‌మ‌నార్హం.

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కూడా దుట్టా, యార్ల‌గ‌డ్డ వ‌ర్గాలే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌‌రిశీల‌కులు.. మ‌రి వంశీ ఎలా ఈ యాంటీ ప్ర‌చారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఒక వేళ వంశీ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గెల‌వ‌డం సులువు కాదు.  


హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>