PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/akhila-priyaa2609425-6056-415c-a50c-7c889dcc25be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/akhila-priyaa2609425-6056-415c-a50c-7c889dcc25be-415x250-IndiaHerald.jpg దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. వైసీపీ నాయ‌కులు దూకుడు పెంచ‌డంతో అఖిల ప్రియ‌కు మ‌ద్ద‌తు దారులుగా ఉన్న చాలా మంది మౌనం పాటిస్తున్నారు. అఖిల ప్రియ‌ను ఫ్యాక్ష‌నిస్టుగా ప్ర‌చారం చేయ‌డంలో వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాను బాగానే వినియోగిస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది. ఈ ప‌రిణామం.. వ్య‌క్తిగ‌తంగా అఖిల‌కు తీవ్ర సంక‌టంగా మారింది. పోనీ.. ఏదోలా ధైర్యం చేసి అఖిల‌కు మ‌ద్ద‌తుగా గ‌ళం వినిపించాల‌ని కొంద‌రు భావిస్తున్నా.. `మ‌న‌కెందుకు? రేపు రాజ‌కీయంగా ఆమె పుంజుకున్నా.. akhila priya;bhuma akhila priya;minister;letter;tdp;ycp;father;dookudu;nandyalaడేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?akhila priya;bhuma akhila priya;minister;letter;tdp;ycp;father;dookudu;nandyalaFri, 15 Jan 2021 08:33:19 GMTత‌న‌దైన దూకుడుతో రాజ‌కీయంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి అఖిల ప్రియ పాలిటిక్స్‌కు పెనుముప్పు పొంచి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌ల్లి భూమా శోభ‌ మ‌రణంతో ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసి 2014లో విజ‌యం సాధించిన అఖిల‌.. తండ్రి మ‌ర‌ణంతో చంద్ర‌బాబు కేబినెట్‌లో అనూహ్యంగా మంత్రి ప‌ద‌విని కూడా సొంతం చేసుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత ఆమె రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఆళ్ల‌గ‌డ్డ‌ను అమ్మ‌గా, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని నాన్న‌గా పేర్కొంటూ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాజ‌కీయాల‌ను వేడెక్కించారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు అనూహ్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో అఖిల ప్రియ అరెస్ట‌యి.. జైలుకు వెళ్లారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. వైసీపీ నాయ‌కులు దూకుడు పెంచ‌డంతో అఖిల ప్రియ‌కు మ‌ద్ద‌తు దారులుగా ఉన్న చాలా మంది మౌనం పాటిస్తున్నారు. అఖిల ప్రియ‌ను ఫ్యాక్ష‌నిస్టుగా ప్ర‌చారం చేయ‌డంలో వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాను బాగానే వినియోగిస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది.

ఈ ప‌రిణామం.. వ్య‌క్తిగ‌తంగా అఖిల‌కు తీవ్ర సంక‌టంగా మారింది. పోనీ.. ఏదోలా ధైర్యం చేసి అఖిల‌కు మ‌ద్ద‌తుగా గ‌ళం వినిపించాల‌ని కొంద‌రు భావిస్తున్నా.. `మ‌న‌కెందుకు?  రేపు రాజ‌కీయంగా ఆమె పుంజుకున్నా.. మ‌న‌ల్ని ప‌ట్టించుకోదు!` అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. టీడీపీలో నూ ఇత‌ర నాయ‌కులు ఎవ‌రూ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో జోక్యం చేసుకుని, అఖిల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం లేదు. దీనికి కూడా మ‌రో రీజ‌న్ చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకుమ‌రో ఇద్ద‌రు రెడీగా ఉన్నారు.

ఆమె సోద‌రి మౌనిక‌, త‌మ్ముడు జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డిలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే వీరి ప‌రిధిలో ఉండ‌గా.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాము ఏం చేసినా.. ఆ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డుతుంద‌ని.. త‌మ‌కు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంట‌ని.. టాప్ లీడ‌ర్లే.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్యానిస్తున్న‌ట్టు స‌మాచారం . దీంతో అఖిల ప్రియ రాజ‌కీయంపై నీలి మేఘాలు క‌మ్ముకోవ‌డం గ‌మ‌నార్హం.  


షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>