WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/skin-61ffe8c8-5e84-4746-9ae1-c0409d97ee7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/skin-61ffe8c8-5e84-4746-9ae1-c0409d97ee7d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సమాజంలో అందానికి ప్రాముఖ్యత చాలా పెరిగింది. నిగనిగలాడే చర్మం కోసం ఆడ మగ తేడా లేకుండా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సౌందర్య చిట్కాలు పాటిస్తే సరిపోతుందా? అనేదే ఇప్పుడు ప్రశ్న. కచ్చితంగా సరిపోదనే బదులిస్తున్నారు నిపుణులు.skin;soundarya;varsha;neem;yogaఅందమైన చర్మం కోసం.. ఈ చిట్కాలు తప్పనిసరి!అందమైన చర్మం కోసం.. ఈ చిట్కాలు తప్పనిసరి!skin;soundarya;varsha;neem;yogaFri, 15 Jan 2021 13:40:00 GMTసౌందర్య చిట్కాలు పాటిస్తే సరిపోతుందా? అనేదే ఇప్పుడు ప్రశ్న. కచ్చితంగా సరిపోదనే బదులిస్తున్నారు నిపుణులు. చర్మ సౌందర్యం కోసం అందుకు తోడ్పడే నియమాలు కూడా కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దామా?

మేకప్‌: ప్రతిరోజూ రాత్రి నిద్ర పోయే ముందు తప్పనిసరిగా మేక్‌ప్ ను పూర్తిగా తీసేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దీంతో అడుగున ఉన్న తాజా చర్మం బయట పడుతూ అందంగా కనిపిస్తుందట .

సన్ ‌స్ర్కీన్‌: కేవలం ఎండగా ఉన్నప్పుడే కాకుండా.. మబ్బు పట్టినా, వర్షం కురుస్తున్నా ముఖ చర్మానికి సన్‌ స్ర్కీన్‌ అప్లై చేయడంఆత్రం ఆపకూడదు. ఎంచుకునే సన్‌స్ర్కీన్‌ ఎస్‌పిఎఫ్‌ కనీసం 15కు తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మానికి రక్షణ దొరుకుతుంది.

పోషకాలు: తాజా కూరగాయలు, పండ్లు చర్మానికి చాలా పోషణ అందజేస్తాయి. అలాగే వేపుళ్లు, జంక్‌ఫుడ్‌, కూల్ డ్రింకులు చర్మానికి చాలా చేటు చేస్తాయి. కాబట్టి చర్మానికి మేలు చేసే పోషకాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

వ్యాయామం: చర్మానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే నిగారింపు వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. జాగింగ్‌, నడక, ఏరోబిక్స్‌, యోగా... మీకు నచ్చింది ఎంచుకుని క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.

నిద్ర: చర్మ సౌదర్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా చాలకపోతే చర్మం నిర్జీవంగా మారిపోతుంది.  కళ్ల కింద నల్లని వలయాలు వచ్చేస్తాయి. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోకూడదు.

నీళ్లు: రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారదు. గ్లాసు నీళ్లలో కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి తాగడం వల్ల పీహెచ్‌ లెవల్‌ నిలకడగా ఉండి, చర్మం నిగారిస్తుంది.

మొటిమలను గోళ్లతో గిల్లకూడదు. రోజు మొత్తంలో కనీసం మూడు సార్లు గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.


అయోధ్య రామ మందిర నిర్మాణానికి తొలి విరాళం ఇచ్చింది ఆయనే...!?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>