Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/exercises0757cdf4-b6ca-4dfd-a97f-d729a88e414a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/exercises0757cdf4-b6ca-4dfd-a97f-d729a88e414a-415x250-IndiaHerald.jpgశారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నా, ఆరోగ్యంతో జీవించాలన్నా శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఈ వ్యాయామం వల్ల రోజు వారీ జీవితంలో చురుగ్గా ఉండడంతోపాటు వేగంగా పనిచేయగలుగుతారు. కనీసం ప్రతి రోజూ ఓ గంట పాటు.. exercises;jeevitha rajaseskhar;tara;chocolate;oxygen;avocado;shaktiవ్యాయామం ముందు ఇవి తింటే 100 % ఫిట్‌నెస్వ్యాయామం ముందు ఇవి తింటే 100 % ఫిట్‌నెస్exercises;jeevitha rajaseskhar;tara;chocolate;oxygen;avocado;shaktiFri, 15 Jan 2021 11:15:00 GMT
 అనేకమంది గంట పాటు వ్యాయామానికి వెచ్చిస్తున్నా.. కొంతమంది వారు బిజీ లైఫ్ కారణంగా క‌నీసం ప‌దిహేను నిమిషాలు అయినా వ్యాయామం చేస్తున్నారు. అయితే ప్రతి వ్యాయామం చేసేవారిలో అనేకమంది ఎంత సేపు వ్యాయామం చేశామని ఆలోచిస్తారు కానీ, వ్యాయామం నేపథ్యంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దానిపై దృష్టి పెట్టరు. దీంతో వారు చేసే వ్యాయామం వల్ల పూర్తి ఫలితం పొందలేకపోతున్నారు. వ్యాయామాలు చేసేవారు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

వ్యాయామానికి అర‌గంట ముందు యాపిల్ లేదా అర‌టి పండు కచ్చితంగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే అనేక రకాల పోష‌కాలు వ్యాయామం చేసేందుకు తగినంత శక్తిని అందించ‌డంతో పాటు కండ‌రాలు చురుగ్గా ప‌ని చేసేలా ఉపయోగప‌డ‌తాయి. చురుగ్గా వ‌ర్క‌వ‌ట్స్‌ చేయాల‌ని భావించే వారు వ్యాయామానికి ముందు తృణధాన్యాలు, బ్రౌన్ బ్రెడ్, అవకాడో, న‌ట్స్‌, పియర్స్ వంటివి తీసుకుంటే ఫుల్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

ఇక వ్యాయామానికి ముందు ఓట్స్‌ను తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువును తగ్గించడంతో పాటు శారీరక శక్తిని పెంచడంలోనూ ఓట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. అయితే వ్యాయామానికి సరిగ్గా ముందు ఓట్స్ తీసుకోవద్దని, ఓట్స్ తీసుకున్న తరువాత వ్యాయామానికి కనీసం 2 గంటల విరామం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని, అయితే వ్యాయామం చేసే ముందు డార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని శక్తి రెట్టింపు అవుతుందని, వ‌ర్క‌వ‌ట్స్‌ను చురుగ్గా చేయ‌గ‌లుగుతారని నిపుణులు చెబుతున్నారు.

 ఇక మరి కొంద‌రికి వ్యాయామం చేసే స‌మ‌యంలో శ్వాస తీసుకోవడంలో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయని, అయితే వ్యాయామానికి ఉపక్రమించే ముందు 5-6 ఖర్జూరాలు తీసుకుంటే ఆక్సిజన్ అందించే ఊపిరిత్తుల్లో ఆక్సిజన్‌ను తీసుకునే శక్తి పెరుగుతుందని, దీనివల్ల శ్వాస సమస్యలు దూరమవుతాయని, అదే స‌మ‌యంలో త‌క్ష‌ణ శ‌క్తి కూడా ల‌భిస్తుందని అంటున్నారు.


తెలంగాణాలో కరోనా వాక్సిన్ వారికి లేనట్టే...!?

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>