Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarune46049be-34a9-438e-84a3-c9ad42d05121-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarune46049be-34a9-438e-84a3-c9ad42d05121-415x250-IndiaHerald.jpgఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తన టాలెంట్ తో సుకుమార్ దృష్టిలో పడ్డాడు.. ఆ వెంటనే కుమారి 21ఎఫ్ తో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ టైం లోనే కరెక్ట్ కథలను ఎంచుకుంటే కెరియర్ వేరేలా ఉండేది కాని వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ ను చేస్తూ వచ్చిన రాజ్ తరుణ్ కెరియర్ లో వెనకపడ్డాడు. రొటీన్ సినిమాలు చేస్తూ సినిమాల లిస్ట్ పెంచుకున్నాడు కాని ఫలితాల మీద మాత్రం ఫోకస్ పెట్టలేదుraj-tarun;kumaar;raj;sukumar;tarun;vijay;cinema;love;comedy;press;thriller;hero;joseph vijay;posters;yuva;raj tarun;uyyala jampala;orey bujjiga;tarun kumarయువ హీరో కొత్తగా ట్రై చేస్తున్నాడు..!యువ హీరో కొత్తగా ట్రై చేస్తున్నాడు..!raj-tarun;kumaar;raj;sukumar;tarun;vijay;cinema;love;comedy;press;thriller;hero;joseph vijay;posters;yuva;raj tarun;uyyala jampala;orey bujjiga;tarun kumarFri, 15 Jan 2021 22:43:05 GMTఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తన టాలెంట్ తో సుకుమార్ దృష్టిలో పడ్డాడు.. ఆ వెంటనే కుమారి 21ఎఫ్ తో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ టైం లోనే కరెక్ట్ కథలను ఎంచుకుంటే కెరియర్ వేరేలా ఉండేది కాని వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ ను చేస్తూ వచ్చిన రాజ్ తరుణ్ కెరియర్ లో వెనకపడ్డాడు. రొటీన్ సినిమాలు చేస్తూ సినిమాల లిస్ట్ పెంచుకున్నాడు కాని ఫలితాల మీద మాత్రం ఫోకస్ పెట్టలేదు.

ఇక లాస్ట్ ఇయర్ రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఓటిటిలో రిలీజైంది. ఈ సినిమా రాజ్ తరుణ్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. సినిమా ఓటిటిలో రిలీజైనా ప్రేక్షకులు సినిమాకు ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఆ సినిమా డైరక్టర్ విజయ్ కుమార్ కొండతో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రాజ్ తరుణ్. పవర్ ప్లే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ క్రేజీగా ఉంది. రొటీన్, రెగ్యులర్ కామెడీ, లవ్ స్టోరీలు చేస్తూ వచ్చిన రాజ్ తరుణ్ కొత్తగా ట్రై చేసినట్టు కనిపిస్తున్నాడు. పవర్ ప్లే సినిమా రాజ్ తరుణ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని అనిపిస్తుంది.

ఇన్నాళ్లు తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్న రాజ్ తరుణ్ ఇక మీదట కెరియర్ ను సీరియస్ గా తీసుకున్నట్టు తెల్సుతుంది. ఆల్రెడీ విజయ్ కుమార్ తో ఒరేయ్ బుజ్జిగా హిట్ అందుకున్న రాజ్ తరుణ్ తన నెక్స్ట్ సినిమా పవర్ ప్లే కూడా అతనితోనే చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే చేతిలో గన్నుతో సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నాడు రాజ్ తరుణ్. చూస్తుంటే రాజ్ తరుణ్ ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసినట్టు ఉన్నాడని తెలుస్తుంది. .




మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

పవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>