PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya5ed353c4-f1c2-498f-8f37-b7706c93566f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya5ed353c4-f1c2-498f-8f37-b7706c93566f-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో వివాదాస్పద భూముల విషయంలో ఎన్ని వివాదాలు జరుగుతున్నాయో.. ఈ బోయినపల్లి కిడ్నాప్‌ కేసు చూస్తే అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టి నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. మొత్తం మీద అఖిలప్రియను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. ఈ వakhilapriya;praveen;ram pothineni;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;reddyషాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?akhilapriya;praveen;ram pothineni;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;reddyFri, 15 Jan 2021 10:17:41 GMTప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది.

మొత్తం మీద అఖిలప్రియను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు భూవివాదానికి సంబంధించి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా... ప్రవీణ్ రావు సోదరుల నుంచి స్పందన లేకపోవడం వల్లే కిడ్నాప్ చేసినట్టు అఖిలప్రియ వివరించారు. తమాషా ఏంటంటే  మొదట్లో అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా... తనకేమీ తెలియదని అఖిలప్రియ దాటేసిందట.

అయితే తాము సంపాదించిన వివరాలు అఖిలప్రియ ముందు పోలీసులు ఉంచేసరికి.. ఇక అఖిలప్రియ నోరు విప్పాల్సివచ్చినట్టు తెలిసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం..  భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్ పల్లి వెళ్లి అపహరణను డైరెక్టుగా మేనేజ్ చేశారట. ఇందుకు తగిన సాంకేతిక ఆధారాలను ఈ మేరకు పోలీసులు చూపించారు. ఆ తర్వాత అఖిల ప్రియ మరికొన్ని వివరాలు బయపెట్టిందట. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. భార్గవ్‌ రామ్,  గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు.

అయితే భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. వైద్య పరీక్షల నిమిత్తం అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల తర్వాత ఆమెను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తర్వాత  మరోసారి చంచల్‌గూడ జైలుకు తరలించారు.


పైకేమో సెలూన్..లోపల మాత్రం అన్నీ అవే.. ఛీ.. ఛీ..

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>