Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vaari-pata-is-another-key-change-in-their-schedule069a88fc-617a-4a1c-9f7d-39df5093d368-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vaari-pata-is-another-key-change-in-their-schedule069a88fc-617a-4a1c-9f7d-39df5093d368-415x250-IndiaHerald.jpg2020 ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. ఆ సినిమా తర్వాత జోరుమీదున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారారు. కాగా ప్రస్తుతం దూకుడుమీదున్న మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహానటి కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. సినిమాకు పరుశురామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇటీవలె ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనmahesh babu;mahesh;keerthi suresh;kirti;parasuram;prince;ram pothineni;thaman s;hyderabad;tollywood;cinema;rajani kanth;2020;industry;blockbuster hit;director;posters;mahanati;dubai;dookudu;adimulapu sureshమహేశ్ ‘సర్కారు వారి పాట’షెడ్యూల్ లో మార్పు..మహేశ్ ‘సర్కారు వారి పాట’షెడ్యూల్ లో మార్పు..mahesh babu;mahesh;keerthi suresh;kirti;parasuram;prince;ram pothineni;thaman s;hyderabad;tollywood;cinema;rajani kanth;2020;industry;blockbuster hit;director;posters;mahanati;dubai;dookudu;adimulapu sureshFri, 15 Jan 2021 11:59:32 GMT2020 ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. ఆ  సినిమా తర్వాత జోరుమీదున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారారు. కాగా ప్రస్తుతం దూకుడుమీదున్న మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహానటి కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. సినిమాకు పరుశురామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇటీవలె ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమా షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కడో జరగాల్సిన షూటింగ్ మరెక్కడో జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా కొన్ని సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా కరోనా క్రైసిస్ మూలంగా ఇక్కడే హైదరాబాద్ లోనే కానిచ్చేస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. చాలా సినిమా పరిస్థితి ఇలాగే తయారయ్యింది. కాగా సూపర్ స్టార్ నటిస్తున్నతాజా చిత్రం‘సర్కారు వారి పాట’ షెడ్యూల్ కూడా అలాగే అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ను అమెరికాలో జరుపుకోవాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆ  షెడ్యూల్ ను హైదరాబాద్ కు మార్చిన సంగతి తెలిసిందే.

కానీ తాజా సమాచారం ప్రకారం.. హైదారాబాద్ షెడ్యూల్ ను దుబాయ్ కి షిప్ట్ చేస్తున్నట్టు వార్తలు షికార్లు కొడుతున్నాయి. దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తి అయ్యాకనే హైదరాబాద్ హెడ్యూల్ ను ప్రారంభిస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రీ పోస్టర్ మహేశ్ అభిమానుల్లో భారీ అంచనాలే పెంచింది. డిఫరెంట్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మూవీని ప్రిన్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు కూడా నిర్మిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. మహేశ్ కోసం అదిరిపోయే పాటలను సిద్ధం చేస్తున్నాడట మ్యూజిక్ డైరెక్టర్ థమన్.


ప్రభాస్ ని లైట్ తీసుకున్న దీపికా

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>