PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/satire/129/chandrababu-truth-curse-jagan-tdp-ycp-amaravati19dc76d8-08f4-4061-bb82-764da99cd988-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/satire/129/chandrababu-truth-curse-jagan-tdp-ycp-amaravati19dc76d8-08f4-4061-bb82-764da99cd988-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు మరియు టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం తన సొంతూళ్లో ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సమేతంగా నారావారి పల్లెకు వెళ్లి.. అందరితో కలిసి సరదాగా పండుగ జరుపుకునేవారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు పండుగ కోసం సొంతూరు వెళ్లారు. కానీ గత రెండేళ్లుగా ఆయన పండుగ కోసం తన సొంతూరికి వెళ్లడం లేదు.దీనికి గల ప్రధాన కారణం విషయానికి వస్తే.... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు దీక్షలు చేస్తుండటమే...chandrababu;cbn;kranthi;kranti;makar sakranti;krishna river;jagan;amaravati;district;telugu;sankranthi;school;festival;chief minister;krishna district;tdp;ycp;bhogiబాబు గారు... పండగకి ఊరు వెళ్ళకపోవటానికి కారణాలు ఇవేనట!బాబు గారు... పండగకి ఊరు వెళ్ళకపోవటానికి కారణాలు ఇవేనట!chandrababu;cbn;kranthi;kranti;makar sakranti;krishna river;jagan;amaravati;district;telugu;sankranthi;school;festival;chief minister;krishna district;tdp;ycp;bhogiFri, 15 Jan 2021 12:40:00 GMTముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు మరియు టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం తన సొంతూళ్లో ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సమేతంగా నారావారి పల్లెకు వెళ్లి.. అందరితో కలిసి సరదాగా పండుగ జరుపుకునేవారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు పండుగ కోసం సొంతూరు వెళ్లారు. కానీ గత రెండేళ్లుగా ఆయన పండుగ కోసం తన సొంతూరికి వెళ్లడం లేదు.



దీనికి గల ప్రధాన కారణం విషయానికి వస్తే.... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు దీక్షలు చేస్తున్న నేపథ్యంలో.. వారికి మద్దతుగా బాబు పండుగ జరుపుకోవడం లేదు. గత ఏడాది సంక్రాంతి రోజున.. మందడంలో దీక్ష చేస్తున్న రైతులను కలిసిన చంద్రబాబు వారికి సంఘీభావం ప్రకటించారు. ‘నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం లేదు. ఏపీకి ఇది కష్టాల సంక్రాంతి’ అంటూ 2020లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి సైతం చంద్రబాబు పండుగ కోసం నారావారి పల్లెకు వెళ్లలేదు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో రైతులతో కలిసి చంద్రబాబు భోగి పండగ జరుపుకున్నారు. జగన్ సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో తగలబెట్టారు. హైదరాబాద్‌లోనే చంద్రబాబు సంక్రాంతి పండుగ జరుపుకున్నారని సమాచారం.
 


అమరావతి రైతుల కోసమే తాను సొంతూళ్లో సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. కానీ ఏమాత్రం ఛాన్స్ దొరికినా చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందుండే వైఎస్సార్సీపీ మాత్రం మరోలా చెబుతోంది. సొంతూరి ప్రజలకు ముఖం చూపించలేకే చంద్రబాబు సంక్రాంతి కోసం నారావారి పల్లెకు వెళ్లలేకపోయారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. బాబు కుప్పం వెళ్లి ఏడాది దాటిందని.. చంద్రబాబు హయాంలో నారావారి పల్లె అభివృద్ధి చెందలేదని.. అక్కడి స్కూల్ బిల్డింగ్‌కు కనీస మరమ్మతులు చేయలేదని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే నారావారి పల్లెలోని పాఠశాల స్వరూపం మారిందని.. తమ ప్రభుత్వం స్కూల్ కోసం రూ.10 లక్షలు కేటాయించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. బాబు సొంతూళ్లో జగన్ సర్కారు 300 మందికిపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిందని.. దీంతో జనం ఎక్కడ తమను తిట్టుకుంటారోనని చంద్రబాబు కుటుంబం పండుగకు సొంతూరు వెళ్లడం లేదని కొంతమంది చెపుతున్నారు.


తెలంగాణలో మృగ‌రాజు సినిమా... ఆ రెండు చోట్లా...!

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>