PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandigam-suresh6dd5fddd-266d-425e-a137-cb4e17473a5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandigam-suresh6dd5fddd-266d-425e-a137-cb4e17473a5e-415x250-IndiaHerald.jpgఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి, చంద్రబాబు డైరెక్షన్ లో బినామీ భూముల కోసం అమరావతిలో కొద్దిమంది చేస్తున్నఉద్యమానికి ముడిపెట్టి రాజకీయం చేయడం టీడీపీ దుర్మార్గమైన రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు బినామీల కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జరుగుతున్న దానిని పోరాటం అంటారో.. ఉద్యమం అంటారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.nandigam suresh;cbn;suresh;nandigam suresh;amaravati;mp;television;capital;court;graphics;letter;tdp;qualification;ycpరైతుల పాలిట అసలైన ద్రోహి చంద్రబాబు: ఎంపీ నందిగం సురేష్రైతుల పాలిట అసలైన ద్రోహి చంద్రబాబు: ఎంపీ నందిగం సురేష్nandigam suresh;cbn;suresh;nandigam suresh;amaravati;mp;television;capital;court;graphics;letter;tdp;qualification;ycpFri, 15 Jan 2021 23:10:48 GMTటీడీపీ దుర్మార్గమైన రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు బినామీల కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జరుగుతున్న దానిని పోరాటం అంటారో.. ఉద్యమం అంటారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుని, రైతులను ఏడిపించి, కేసులు పెట్టించి, భూములు ఇవ్వని రైతులకు చెందిన తోటలు, పశువుల పాకలు తగులబెట్టించిన చంద్రబాబు నాయుడే రైతుల పాలిట అసలైన ద్రోహి అని సురేష్ దుయ్యబట్టారు.
                              చంద్రబాబు తన స్వార్థం కోసం మూడు, నాలుగు పంటలు పండే అమరావతి రైతుల భూములు లాక్కుని మోసం చేశారని నందిగం సురేష్  ఆరోపించారు. చంద్రబాబుకు ఐదేళ్ళు అధికారం ఇస్తే.. రాజధాని పేరుతో గ్రాఫిక్స్, డిజైన్స్ చూపించి రైతులను వంచించారని విమర్శించారు. ఇటువంటి చంద్రబాబు సంక్రాంతికి పంచె కట్టి, తానూ రైతునంటే నమ్మటానికి ఏ ఒక్క రైతూ సిద్ధంగా లేడని నందిగం సురేష్ తేల్చి చెప్పారు. రైతు అన్న పదం పలకటానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఆ పదం పలకాలంటే..  రైతుల మేలు కోసం, వారి సంక్షేమం కోసం పని చేసిన నాయకుడై ఉండాలి తప్పితే.. చంద్రబాబు నాయుడులా రైతులను ఏడిపించే వారిలా ఉండకూడదని స్పష్టం చేశారు. కరెంటు చార్జీలు కట్టకపోతే రైతులను జైళ్ళల్లో పెట్టించి, ప్రత్యేక కోర్టులు పెట్టి శిక్షలు వేయించిన చంద్రబాబును ఏ ఒక్కరైనా రైతు అంటారా..? రైతు ద్రోహి అంటారా..? అని ప్రశ్నించారు.
                         అమరావతి ప్రాంతంలో 54 వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైతే.. కోర్టులకు వెళ్ళి ఎందుకు అడ్డుకున్నారు..? అంటే వాళ్ళల్లో దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలు ఉన్నారే కదా..? పేద ప్రజలకు పట్టాలు ఇస్తే.. అక్కడ డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని మీరు కోర్టుల్లో వాదించింది నిజం కాదా..? అంటూ ఎంపీ నిలదీశారు.
              రెండు పత్రికలు, మూడు టీవీ ఛానళ్ళు వంద రోజులు, రెండు వందల రోజులు, మూడొందలు, నాలుగొందలు.. అని ఊదరగొట్టినంత మాత్రాన రైతులు ఎవరు?, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎవరు?, చంద్రబాబు బినామీలు ఎవరు? అన్న సత్యాన్ని సమాధి చేయలేరన్నారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు ద్రోహిగానే చరిత్రలో మిగిలిపోతారు.. రైతులపై మొసలి కన్నీళ్ళు కార్చినంత మాత్రాన చంద్రబాబును ఎవరూ నమ్మరని ఎంపీ నందిగం సురేష్ కరాఖండీగా చెప్పారు.


అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు భారీ షాకివ్వనున్న అల్లు అరవింద్

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

‘వకీల్ సాబ్’ క్రెడిట్ మొత్తం అతనికేనా?.. ఫ్యాన్స్ ఏమంటున్నారు?

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

‘ఆర్ఆర్ఆర్’ టీంపై సెటైర్.. సినిమా యూనిట్ కూడా ఫిదా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>