PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpgమిగిలిన రాజ‌కీయ వార‌సులు అంద‌రూ క‌ట్ట‌క‌ట్టుకుని ఓడిపోయారు. ఇక ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోన్న కొత్త వారిలో దిగ్గ‌జ నేత‌లుగా ఓ వెలుగు వెలిగిన వార‌సులు గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు ఉన్నారు. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రాం స‌త్తెన‌ప‌ల్లి సీటు నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక మ‌రో నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు స‌త్తెన‌ప‌ల్లి లేదా పెద‌కూర‌పాడు సీటు నుంచి పోటీ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇక విశాఖ జిల్లాలో న‌ర్సీప‌ట్నం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో tdp ysrcp;bhanu;krishna;bandara;andhra pradesh;vishakapatnam;mla;minister;air;letter;tdp;ycp;tuni;pendurthiఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!tdp ysrcp;bhanu;krishna;bandara;andhra pradesh;vishakapatnam;mla;minister;air;letter;tdp;ycp;tuni;pendurthiFri, 15 Jan 2021 11:15:58 GMTరాజ‌కీయాలు, సినిమాల్లో వార‌సుల రాజ్యం తెలిసిందే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే చాలా మంది రాజ‌కీయ వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇక వైసీపీ నుంచి కూడా కొంద‌రు వార‌సులు త‌మ అదృష్టం ప‌రీక్షించుకున్నారు. ఇక ఈ వార‌సుల‌తో పాటు మ‌రి కొంద‌రు వార‌సులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంట్రీ ఇచ్చిన వారిలో ప‌రిటాల శ్రీరామ్‌, గౌతు శిరీష‌, ఆదిరెడ్డి భ‌వానీ, కేఈ శ్యాంబాబు, గాలి భానుప్రకాష్ నాయుడు, కాగిత కృష్ణ ప్రసాద్‌ ఇలా చాలా మంది నేత‌లే పోటీ చేశారు. వీరిలో ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ ఒక్క‌రే రాజ‌మండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

మిగిలిన రాజ‌కీయ వార‌సులు అంద‌రూ క‌ట్ట‌క‌ట్టుకుని ఓడిపోయారు. ఇక ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోన్న కొత్త వారిలో దిగ్గ‌జ నేత‌లుగా ఓ వెలుగు వెలిగిన వార‌సులు గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు ఉన్నారు. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రాం స‌త్తెన‌ప‌ల్లి సీటు నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక మ‌రో నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు స‌త్తెన‌ప‌ల్లి లేదా పెద‌కూర‌పాడు సీటు నుంచి పోటీ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇక విశాఖ జిల్లాలో న‌ర్సీప‌ట్నం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న పాత్రుడు త‌న‌యుడు విజ‌య్ పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టే..!

ఇక అదే విశాఖ జిల్లాలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి త‌న‌యుడు అప్పల‌నాయుడు కూడా పెందుర్తిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సైతం త‌న కుమార్తె దివ్య‌ను పోటీ చేయించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితు తుని నియోజ‌క‌వ‌ర్గం దివ్య‌కు అంత సేఫ్ కాద‌న్న భ‌యం కూడా ఆయ‌నకు ఉంది. ఇక అదే జిల్లాలో మ‌రో మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి కూడా వ‌య‌స్సు పై బ‌డ‌డంతో త‌న సోద‌రుడి కుమారుడిని లైన్లో పెడుతూ.. త‌న రాజ‌కీయ వార‌సుడిగా తెర‌మీద‌కు తెస్తున్నారు. ఇక వైసీపీ నుంచి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వార‌సుడితో పాటు మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సారావు త‌న‌యుడు సైతం రేసులో ఉన్నారు. 


రాసి పెట్టుకోండి.. మోదీ చేయబోయేది ఇదే: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>