Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam0ea56de7-2019-4a8f-92dd-ee83ef9da916-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam0ea56de7-2019-4a8f-92dd-ee83ef9da916-415x250-IndiaHerald.jpgఎవరైనా స్టార్ హీరోల సినిమా రాబోతోందంటే దానిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇక ఫ్యాన్స్ విషయానికొస్తే ఎప్పడెప్పుడు తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా..radhesyam;prabhas;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;festival;media;industry;hero;kgf;uv creationsఇంతకంటే సినిమా మానేసి ఇంట్లో కూర్చోండి.. ‘రాధేశ్యామ్’పై ఫ్యాన్స్ ఫైర్ఇంతకంటే సినిమా మానేసి ఇంట్లో కూర్చోండి.. ‘రాధేశ్యామ్’పై ఫ్యాన్స్ ఫైర్radhesyam;prabhas;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;festival;media;industry;hero;kgf;uv creationsFri, 15 Jan 2021 11:09:31 GMTసినిమా రాబోతోందంటే దానిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇక ఫ్యాన్స్ విషయానికొస్తే ఎప్పడెప్పుడు తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దానిని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తారు. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ప్రభాస్ తాజాగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో వారి సహనం నశిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్‌పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

తమ అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. సినిమా ప్రమోషన్స్, సోషల్ మీడియా ట్రెండ్స్, చివర్లో బాక్సాఫీస్ హిట్.. ఇవన్నీ ఫ్యాన్స్‌కు ఎంతో ప్రెస్టీజ్‌గా తీసుకుంటారు. రికార్డు స్థాయిలో ఆన్‌లైన్‌లో పోస్ట్‌‌లు చేస్తూ వ్యూస్‌ కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. కాని యూవీ క్రియేషన్స్‌ మాత్రం ప్రభాస్ అభిమానులకు పట్టించుకోవడం లేదు. సంక్రాంతికి ఒకవేళ రాధేశ్యామ్‌ టీజర్ వచ్చి ఉంటే ఇతర రికార్డులు అన్ని కూడా పక్కకు పోయేవి అనడంలో సందేహం లేదని, ప్రభాస్‌‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిదని, ఖచ్చితంగా కేజీఎఫ్-2 టీజర్‌ రికార్డులు కూడా బ్రేక్‌ అయ్యేవని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

రాధేశ్యామ్ అప్‌డేట్‌ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్‌ లుక్‌ కోసం ఏడాది వెయిట్‌ చేసిన అభిమానులు ఇప్పుడు టీజర్ కోసం కళ్లు కాయలు కాసేచేలా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సంక్రాంతికి రాధేశ్యామ్‌ టీజర్‌ వస్తుందని అంతా ఆశించారు. కాని మరోసారి యూవీ క్రియేషన్స్ నిరాశనే మిగిల్చింది.

ఇదే తరహాలో యూవీ క్రియేషన్స్ గతంలో కూడా చేసింది. దాంతో అప్పట్లో యూవీ క్రియేషన్స్‌‌కు పబ్లిసిటీ చేసుకోవడం రాదని, అందువల్ల వారిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేయాలని, ప్రభాస్ వంటి స్టార్‌ హీరోతో సినిమా చేస్తున్నారంటే రెగ్యులర్ అప్‌డేట్స్‌తో అదరగొట్టాలని, సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచాలని, కానీ యూవీ క్రియేషన్స్ మాత్రం ఆ వైపుగా అసలు ఆలోచనే చేయడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ది లేని యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు అంటూ చాలా మంది నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు. ఇలా ప్లానింగ్‌ తెలియని వారు సినిమాలు నిర్మించడం మానేయాలంటూ మరి కొందరు సూచిస్తున్నారు.  

సంక్రాంతి పండుగ బిజీలో పడి సినిమా టీజర్‌ను విడుదల చేయకపోవడం బాధాకరమని అంటున్నారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదంటూ ప్రభాస్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆగ్రహానికి యూవీ క్రియేషన్స్ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి. ఇప్పటికైనా సినిమా అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఇస్తూ వారి కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందేమో చూడాలి.


తెలంగాణాలో కరోనా వాక్సిన్ వారికి లేనట్టే...!?

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>