PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-a-vaccine-reaction-is-givenb9c1c650-0508-49ae-8129-a12ddd9510fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-a-vaccine-reaction-is-givenb9c1c650-0508-49ae-8129-a12ddd9510fd-415x250-IndiaHerald.jpgటీకా పంపిణీలో పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌కి చేరుకున్న వ్యాక్సిన్‌లను జిల్లాలకు డోసులు పంపించింది వైద్యారోగ్యశాఖ. వ్యాక్సినేషన్‌పై తాజా మార్గదర్శకాలు సైతం జిల్లా యంత్రాంగానికి చేరాయి. కోఠి సెంటర్ కు 3లక్షల 64 వేల కోవిషీల్డ్‌ డోసులు... 20 వేల కోవాగ్జిన్ డోసులు చేరుకున్నాయి. అయితే తొలి రోజు కేవలం నాలుగు వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాలకు వ్యాక్సిన్‌ డోసులను కేటాయించారు. హడావిడిగా కాకుండా నెమ్మదిగానే టీకా పంపిణీ చేయif a vaccine reaction is given;health;modi;telangana;district;prime minister;director;central governmentఒక వేళ టీకా రియాక్షన్ ఇస్తే..!ఒక వేళ టీకా రియాక్షన్ ఇస్తే..!if a vaccine reaction is given;health;modi;telangana;district;prime minister;director;central governmentFri, 15 Jan 2021 17:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌కి చేరుకున్న వ్యాక్సిన్‌లను జిల్లాలకు డోసులు పంపించింది వైద్యారోగ్యశాఖ. వ్యాక్సినేషన్‌పై తాజా మార్గదర్శకాలు సైతం జిల్లా యంత్రాంగానికి చేరాయి. కోఠి సెంటర్ కు 3లక్షల 64 వేల కోవిషీల్డ్‌ డోసులు... 20 వేల కోవాగ్జిన్ డోసులు చేరుకున్నాయి. అయితే తొలి రోజు కేవలం నాలుగు వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాలకు వ్యాక్సిన్‌ డోసులను కేటాయించారు. హడావిడిగా కాకుండా నెమ్మదిగానే టీకా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిరోజు ఒక్కో కేంద్రంలో కేవలం 30మందికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. 139 కేంద్రాలతో పాటు 40కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా తాజా మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికే టీకా ఇవ్వాలని నిర్ణయించారు. విడుతల వారీగా వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య పెరగనుంది. వచ్చే సోమవారం నుంచి వ్యాక్సిన్ తీసుకొనే వారి సంఖ్య పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలిరోజు వ్యాక్సిన్ తీసుకొనే వారికి గురువారం మధ్యాహ్నం నుంచి మెసేజ్‌లు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి ఈ నెల 16 ఉదయమే వ్యాక్సిన్‌ సెంటర్లకు వయల్స్‌ను తరలిస్తారు. అయితే వ్యాక్సిన్‌ ఇచ్చాక ఖాళీ అయిన సీసాలను సైతం సిబ్బంది సర్కార్‌కు లెక్క చూపించాల్సి ఉంటుంది.

టీకా పంపిణీలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు వైద్య సిబ్బందికి టీకా ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అయితే తెలంగాణ సర్కార్‌ మాత్రం ఆస్పత్రుల్లో పని చేసే సఫాయి ఖర్మచారిలకు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 3 లక్షల 30వేల మంది వ్యాక్సిన్ కోసం కోవిన్ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 15 వేలమంది కేంద్ర వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న వారున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజులలోపు మళ్లీ ఎప్పుడు తీసుకోవాలనే దానిపై  సమాచారం పంపించడంతో పాటు.. రెండో డోస్ తీసుకొనే తేదీని సైతం టీకా ఇచ్చిన రోజే నిర్ణయించునున్నారు. రాష్ట్రానికి వచ్చిన 20 వేల కోవాగ్జిన్ డోస్ తీసుకునే వారి నుంచికన్సల్ట్ ఫామ్‌ను తీసుకుంటారు అధికారులు. వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలనే బలవంతం లేకుండా చర్యలు చేపట్టారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు నమోదు చేసుకుని.. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తే రిఫ్యూజ్‌ అని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ముందుగా ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు.. తర్వాత ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇస్తారు. రెండో రోజు 50 మందికి.. ఆ తర్వాత అంచెలవారీగా వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయనుంది ప్రభుత్వం.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే రియాక్షన్స్ పై సర్కార్ సీరియస్‌గా ఫోకస్ చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 అసుప్రతులను సిద్ధం చేసింది. ఇందులో ప్రతిచోట 10 ఐసీయూ బెడ్లను సైతం ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ పై ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో కాల్ సెంటర్ సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే నార్సింగిలోని వ్యాక్సిన్‌ సెంటర్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్‌తో ప్రధాని మోడీ మాట్లాడుతారని అధికారులు తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రంలోని మిగతా 137 సెంటర్లలో మోడీ స్పీచ్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.




అందుకే చంద్రబాబు సొంతూరులో సంక్రాంతి జరుపుకోవడం లేదంట..

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>