MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/susvagatham-movieca8b76be-28d2-4042-a657-d69aa5d2a1f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/susvagatham-movieca8b76be-28d2-4042-a657-d69aa5d2a1f9-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో సుస్వాగతం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ ఎంతో అద్భుతమైన నటనను కనపరిచాడు. అందుకే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రఘువరన్, హీరోయిన్ దేవయాని తమ తమ పాత్రల్లో యాక్టింగ్ ను అదరగొట్టేసారు. susvagatham movie;pawan;chiranjeevi;soundarya;abbas;chakravarthy;choudary actor;devayani;kalyan;pawan kalyan;prema;raasi;raghu;raghuvaran;seetha;srinivas;audi;cinema;telugu;tamil;love;september;remake;press;hero;girl;heroine;father;akkada ammai ikkada abbaiపవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?పవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?susvagatham movie;pawan;chiranjeevi;soundarya;abbas;chakravarthy;choudary actor;devayani;kalyan;pawan kalyan;prema;raasi;raghu;raghuvaran;seetha;srinivas;audi;cinema;telugu;tamil;love;september;remake;press;hero;girl;heroine;father;akkada ammai ikkada abbaiFri, 15 Jan 2021 18:00:00 GMTపవన్ కళ్యాణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో సుస్వాగతం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ ఎంతో అద్భుతమైన నటనను కనపరిచాడు. అందుకే  ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రఘువరన్, హీరోయిన్ దేవయాని తమ తమ పాత్రల్లో యాక్టింగ్ ను అదరగొట్టేసారు. ఈ సినిమాలో 1998 లో రిలీజ్ అయి  ఆల్  టైం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో సూపర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి.  అయితే సుస్వాగతం సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..  వాస్తవానికి ఈ సినిమాను  తమిళ్ సినిమా అయిన  “లవ్ టుడే” కి రీమేక్ గా రూపొందించారు. ఈ సినిమా  తమిళ్ లో  సూపర్ హిట్ అవడంతో తెలుగులో కూడా రీమేక్ చేసారు. ఈ సినిమా ని రీమేక్ చేయాలన్న ఆలోచన ఆర్బీ చౌదరి కి వచ్చింది.ఈ సినిమాకు శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించారు. హీరో కోసం  చాలా మంది పేర్లను పరిశీలించారు. మొదట జెడి చక్రవర్తి, అబ్బాస్ ఇలా పలు పేర్లు అనుకున్నారట.

ఆ సమయానికి పవన్  ‘గోకులం లో సీత’ సినిమా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్బీ చౌదరి పవన్ తొలుత నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇంప్రెస్ అయి ఆయనను ఫిక్స్ అయ్యారట. ఆ తరువాత కథను  చిరంజీవి కి చెప్పి, పవన్ కి కూడా కథ వినిపించారు.సినిమా స్టోరీ ఇద్దరికి నచ్చడంతో ఒకే చెప్పారట. అయితే ఈ సినిమాలో తమిళంలో చేసిన రాశినే  మొదట హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ, అప్పటికి రాశి బిజీ గా ఉండడం తో దేవయానిని ఎంచుకున్నారు. ఈ సినిమాకి అన్ని పాత్రలు చక్కగా అతికినట్లు సరిపోయాయి.అయితే ఈ సినిమాలో  రఘువరన్ చనిపోయినప్పుడు ఆయన  సమాధి దగ్గర పవన్ ఏడ్చే సీన్ కోసం ఎంత ప్రాక్టీస్ చేసారోనట.  రెండు రోజులు ఏమి తినలేదు. దానితో బాగా నీరసం వచ్చేసింది. ఆ నీరసం లో ఉన్నప్పుడే కన్నీళ్లు పెడుతూ పవన్ ఈ షూట్ లో పాల్గొన్నారు. కేవలం ఈ సీన్ కోసమే పవన్ రెండు రోజులు ఏమి తినకుండా ఉన్నారు. సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజు న ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.  

ప్రతి సన్నివేశం లోను పవన్ ప్రాణం పెట్టి నటించినట్లు అనిపిస్తుంది. తండ్రి ప్రేమ, మరో వైపు ప్రియురాలు తిరస్కరణ వంటి వాటి మధ్య నలిగిబోతు పవన్ నటన చూసే ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆలయన హారతి, ఏ స్వప్నలోకాన సౌందర్య రాశి వంటి పాటలు ఇప్పటికి వినేవారు ఉన్నారు. ఈ సినిమా అప్పట్లోనే 49 సెంటర్లలో 50 డేస్ ఆడింది అంటే సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.ఇప్పటి సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. కొన్ని అయితే అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియడం లేదు. సుస్వాగతం సినిమా  9 సెంటర్లలో వందరోజులు విజయవంతం గా ప్రదర్శించబడి, అప్పట్లోనే మొత్తం ఆరుకోట్ల షేర్లను రాబట్టింది అంటే రికార్డు నెలకొల్పినట్లే కదా.. !!


మళ్ళీ జనసేన ను పక్కకు పెట్టిన బీజేపీ.. పవన్ ఊరుకునేనా..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>