PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/polio-vaccination-to-be-started-from-this-month-endecdc6f52-3c00-41da-a9b9-cdb679a6f686-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/polio-vaccination-to-be-started-from-this-month-endecdc6f52-3c00-41da-a9b9-cdb679a6f686-415x250-IndiaHerald.jpgజనవరి 17న దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన పోలియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. జనవరి 31కి దాన్ని తిరిగి మొదలు పెడుతోంది. తొలుత కరోనా వ్యాక్సినేషన్ కోసమే పోలియో వ్యాక్సినేషన్ వాయిదా వేశారని అనుకున్నా.. కరోనా పని పూర్తి కాకముందే పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టడం విశేషం. అయితే చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే కరోనా తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, పోలియో టీకా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అధికారులు. కరోనా వ్యాక్సినేషన్ లో టీకా వేయించుకున్న ఆరోగ్య polio vaccination;tara;january;central government;polio;ramnath kovindపోలియా వ్యాక్సిన్ వాయిదాకి అసలు కారణం అదే..పోలియా వ్యాక్సిన్ వాయిదాకి అసలు కారణం అదే..polio vaccination;tara;january;central government;polio;ramnath kovindFri, 15 Jan 2021 09:00:00 GMTజనవరి 17న దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన పోలియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. జనవరి 31కి దాన్ని తిరిగి మొదలు పెడుతోంది. తొలుత కరోనా వ్యాక్సినేషన్ కోసమే పోలియో వ్యాక్సినేషన్ వాయిదా వేశారని అనుకున్నా.. కరోనా పని పూర్తి కాకముందే పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టడం విశేషం. అయితే చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే కరోనా తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, పోలియో టీకా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అధికారులు. కరోనా వ్యాక్సినేషన్ లో టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే పోలియో డ్రాప్స్ వేయడానికి విధులు కేటాయిస్తారు.

ఈనెల 16నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలకు టీకా సరఫరా పూర్తయింది. మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. తొలి దశలో కరోనా టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ఈనెల 31న పోలియో టీకా కార్యక్రమానికి హాజరవుతారు. అలా కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లానింగ్ తోనే రెండు టీకాల కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేసింది.

కరోనా భయంలో పోలియో డ్రాప్స్ వేయించుకోవాలంటే తల్లిదండ్రులు వెనకడుగేసే ప్రమాదం ఉంది. అందులోనూ పిల్లల్ని ఎత్తుకుని, వారి నోట్లో పోలియో డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది ఆరోగ్య కార్యకర్తలు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టడం అసాధ్యం. అందుకే తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి, వారి ద్వారా పోలియో టీకా పంపిణీ చేయబోతున్నారు అధికారులు. అంటే పూర్తి రక్షణాత్మక చర్యలతో పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారనమాట. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జనవరి 30న ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జనవరి 31న పోలియో ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుంది.


మిరియాలతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు తెలుసా?

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>