PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీలో వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అధికార, విపక్షల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే దేవాలయాలపై దాడులకు పాల్పడేవారి ఆటకట్టించేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపjagan;amala akkineni;pooja hegde;tiru;jagan;andhra pradesh;district;tirupati;husband;cow slaughter;narasaraopet;tadepalli;hindus;petta;narasaraopetaఏపీ లో గోపూజతో ... ఆ అపచారాన్ని కడిగేస్తారా....!?ఏపీ లో గోపూజతో ... ఆ అపచారాన్ని కడిగేస్తారా....!?jagan;amala akkineni;pooja hegde;tiru;jagan;andhra pradesh;district;tirupati;husband;cow slaughter;narasaraopet;tadepalli;hindus;petta;narasaraopetaFri, 15 Jan 2021 10:15:22 GMTజగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక,  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు.ఆ దాడి ఎవరు చేయించినా అప్రదిష్ట మాత్రం ప్రభుత్వానికే వచ్చింది . అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది. హిందువులు దేవతగా భావించే గోవులకు గోపూజా మహోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు.


 గుంటూరు జిల్లా నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో జరగనున్న గోపూజ మహోత్సవంలో స్వయంగా సీఎం జగన్ పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2వేల 679 ఆలయాల్లో ఈ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. నంతరం గోపూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటా 10 నిమిషాలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. గోపూజ మహోత్సవ కార్యక్రమానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇక, ‘గోవు సమస్త దేవతాస్వరూపం. గోమాతను పూజించడం రుషులకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. గోవుల యందు సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉన్నాయని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. గోవుకు సమానమైనది లేదు. గోపూజ చేయడం వలన, గో సంరక్షణ చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి. గోపూజ జరపడం వలన మానవాళిని పీడిస్తున్న సమస్త దోషాలు తొలగి, శ్రేయస్సు కలుగుతుంది. గోమాతల రక్షణ సర్వమాణవాళి రక్షణ కాగలదు.’ అని దేవాదాయ శాఖ పేర్కొంది.గోమాతను ఇంటి మహాలక్ష్మిగా పూజిస్తారని ... మన సాంప్రదాయంలో పాడి పంటలో పాడికి ప్రాశస్త్యం వుందని, ముఖ్యంగా గోవుకి మరింత ప్రాముఖ్యత వుందన్నారు. గో పంచకానికి విశిష్ట లక్షణాలున్నాయని, ఆరోగ్యానికి ఇది ఉపకరిస్తుందన్నారు.




పైకేమో సెలూన్..లోపల మాత్రం అన్నీ అవే.. ఛీ.. ఛీ..

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>