PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccination86cf6b0a-f444-4269-be8e-e1407a5adbf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccination86cf6b0a-f444-4269-be8e-e1407a5adbf5-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి నివారణకు జనవరి 16న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రులల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో దశలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేటు ఆస్పత్రులలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి తెలిపారు. corona vaccination;raj;warangal;telangana;january;panchayati;minister;mahabubabad;letter;central government;bhupalpallyతెలంగాణలో 139 ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్తెలంగాణలో 139 ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్corona vaccination;raj;warangal;telangana;january;panchayati;minister;mahabubabad;letter;central government;bhupalpallyFri, 15 Jan 2021 16:58:04 GMTజనవరి 16న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రులల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో దశలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేటు ఆస్పత్రులలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్రంలోని 33 జిల్లాలకు మొదటి విడతగా 5,527 కోవిడ్ షీల్ టీకా వాయిల్సు పంపిణీ చేయడం జరిగిందని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
                                           అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి వరంగల్ అర్బన్ జిల్లాకు 2,640 డోసులు ( 264 వాయిల్సు), వరంగల్ రూరల్ జిల్లాకు 580 డోసులు (58 వాయిల్సు), మహబూబాబాద్ జిల్లాకు 1720 డోసులు (172 వాయిల్సు), జనగాం జిల్లాకు 830 డోసులు (83 వాయిల్సు), ములుగు జిల్లాకు 560 డోసులు (56 వాయిల్సు), భూపాలపల్లి జిల్లాకు 500 డోసులు (50 వాయిల్సు) రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనవరి 17వ తేదీ నుండి 21 ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
                     కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలోకి ప్రవేశించినప్పుడే అక్కడున్న వైద్యులు లబ్దిదారుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తారని, జ్వరం ఉన్నట్లు తేలితే లోపలికి అనుమతించరని మంత్రి దయాకర్ రావు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నా, లక్షణాలు ఉన్నా టీకా ఇవ్వరని తేల్చి చెప్పారు. తొలి డోసు పొందాక లబ్ధిదారుడు
రెండో డోసు ఎప్పుడు పొందాలో సదరు వ్యక్తి మొబైల్ కు మెసేజ్ వస్తుందని, రెండో డోసు పూర్తయ్యాక కోవిడ్ టీకా పొందినట్లుగా మొబైల్ ఫోన్‌కు దృవపత్రం అందుతుందని మంత్రి తెలిపారు. ఎవరికైనా వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్స అందించడానికి రాష్ట్రంలోని ఆస్పత్రులలో ఐ‌సి‌యూ పడకలను సిద్దంగా ఉంచినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియజేశారు.


మళ్ళీ జనసేన ను పక్కకు పెట్టిన బీజేపీ.. పవన్ ఊరుకునేనా..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>