PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sreeramdfc1d4a8-71ca-44b9-9014-8da00b669f40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sreeramdfc1d4a8-71ca-44b9-9014-8da00b669f40-415x250-IndiaHerald.jpgశ్రీరాముడు మానవ జాతికి ఇలవేలుపు. మర్యాద పురుషోత్తముడు. రామాయణం జీవన పారాయణం. రాముడు ఆదర్శ పురుషుడిగా చెబుతారు. ఆ దేవుడిని తలచుకుంటూ స్పూర్తిగా తీసుకుని యావత్తు విశ్వ మానవాళి ఈ రొజుకు కూడా ముందుకు సాగుతోంది. అటువంటి రాముడు నడయాడిన నేలగా భారతదేశాన్ని చెబుతారు. sreeram;deva;kanchi;ramu;tara;tiru;vishwa;bharatiya janata party;sathwara;district;kanchipuram;central government;rama tirtha;racchaరామతీర్ధం రాముడి విగ్రహం రెడీ ?రామతీర్ధం రాముడి విగ్రహం రెడీ ?sreeram;deva;kanchi;ramu;tara;tiru;vishwa;bharatiya janata party;sathwara;district;kanchipuram;central government;rama tirtha;racchaFri, 15 Jan 2021 10:30:00 GMTవిశ్వ మానవాళి ఈ రొజుకు కూడా  ముందుకు సాగుతోంది. అటువంటి రాముడు నడయాడిన నేలగా భారతదేశాన్ని చెబుతారు.

మరి ఆ రాముడుకి తీరని అపచారమే జరిగింది. గత నెలలో  విజయనగరం జిల్లా రామతీర్ధం లోని బోడి కొండ  మీద ఉన్న కోదండ రాముడి శిరస్సుని దుండగులు ఖండించి మరీ సృష్టించిన విద్వంశం ప్రతి ఆస్తికున్ని బాధ పెట్టిన సంగతి విధితమే. మతాలు వేరు అయినా దేవుడిని నమ్మిన వారంతా ఈ దురాగతాన్ని చూసి కన్నీరు పెట్టారు. ఆగ్రహించారు కూడా. ఇక రాజకీయ రచ్చ ఒక లెక్కన జరిగింది.

కొత్త ఏడాది వస్తూనే చంద్రబాబు సహా బీజేపీ నేతలు రామతీర్ధాలుకు వచ్చి ఆందోళనలు చేశారు. మొత్తానికి ప్రభుత్వం కూడా మేలుకుంది. వెంటనే సత్వర విచారణకు ఆదేశించింది. ఇపుడు రాముడు కోవెలను పూర్తిగా  తీర్చిదిద్దే పనిలో ఉంది. ఇక రామతీర్థం  ఆలయం కోసం తిరుపతిలో విగ్రహాలు సిద్దమవుతున్నాయి.   ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు తయారు చేయించడం విశేషం.   తిరుపతిలోని టీటీడీకి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణం శిల్ప సంస్థలో విగ్రహాలను తయారు చేస్తున్నారు.

 కంచి నుంచి  తెప్పించిన రాయితో విగ్రహాలను  శిల్పులు చెక్కుతున్నారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే  ప్రారంభమయ్యాయి. మరో  పదిరోజుల్లో మూడు విగ్రహాలను శిల్పులు దేవాదాయ శాఖకు వీటిని  అందించనున్నారని అంటున్నారు.  మొత్తానికి కోదండరాముడు భక్త జన హృదయాలలో ఆనంద డోలికలూగించేందుకు వస్తున్నాడు. ఇది అందరికీ శుభకరమైన వార్తగానే చూడాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసారి రామతీర్ధాలులో  శ్రీరామ నవమి ఉత్సవాలు దేదీప్యమానంగా జరుగుతాయని అంటున్నారు. 'ఉత్తరాంధ్రా భద్రాద్రిగా మరింతగా ప్రాచుర్యం పొందనుంది ఈ ఆధ్యాత్మిక కేంద్రం.








మా సోముకు మ‌తికానీ పోయిందా..? బీజేపీ వాళ్ల‌కు ఇంత కోపం ఏంటో..!

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>