MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathi-formers-sensational-shock-given-to-ap-governament43acb446-b1bc-4f97-97dc-f714877cad11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathi-formers-sensational-shock-given-to-ap-governament43acb446-b1bc-4f97-97dc-f714877cad11-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం విడిపోయాక అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ పెద్ద ఎత్తున భూమి సమీకరించారు కూడా. అయితే పాత పద్ధతిలో భూమికి రేటు కట్టి భూమి సమీకరించకుండా ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి తీసుకున్న భూమి లో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చే విధంగా ఆయన దాదాపు 33 వేల ఎకరాలు సేకరించారు. అయితే అనూహ్యంగా జగన్ అధికారంలోకి రావడం వచ్చిన కొన్ని నెలలకే అమరావతి రాజధాని ప్రకటించినtollywood;jayam ravi;kranthi;kranti;ravi anchor;varsha;makar sakranti;jagan;amaravati;andhra pradesh;tollywood;cinema;sankranthi;tamil;capital;chief minister;hero;central governmentమన హీరోల కంటే ఆ తమిళ్ హీరో బెటర్.. అమరావతి రైతుల ప్రసంసల వర్షం !మన హీరోల కంటే ఆ తమిళ్ హీరో బెటర్.. అమరావతి రైతుల ప్రసంసల వర్షం !tollywood;jayam ravi;kranthi;kranti;ravi anchor;varsha;makar sakranti;jagan;amaravati;andhra pradesh;tollywood;cinema;sankranthi;tamil;capital;chief minister;hero;central governmentFri, 15 Jan 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం విడిపోయాక అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ పెద్ద ఎత్తున భూమి సమీకరించారు కూడా. అయితే పాత పద్ధతిలో భూమికి రేటు కట్టి భూమి సమీకరించకుండా ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి తీసుకున్న భూమి లో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చే విధంగా ఆయన దాదాపు 33 వేల ఎకరాలు సేకరించారు. అయితే అనూహ్యంగా జగన్ అధికారంలోకి రావడం వచ్చిన కొన్ని నెలలకే అమరావతి రాజధాని ప్రకటించిన సమయంలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ అమరావతి కాకుండా రాజధాని విశాఖకు తరలిస్తున్నామని కొన్ని ఫీలర్లు వదిలారు. 

అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకువచ్చారు. అలా చేస్తే తాము ఇచ్చిన భూమికి విలువ లేకుండా పోతుందని అమరావతి రైతులు చాలా రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలను ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ రైతులకు మద్దతు తెలిపితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లినట్టు అవుతుంది కాబట్టి టాలీవుడ్ హీరోలు ఎవరూ ఈ విషయం మీద స్పందించడం లేదు. 

అలాంటిది ఒక తమిళ హీరో తన సినిమాలో అమరావతి రైతుల గురించి గొప్పగా ఒక సీన్ లో మాట్లాడడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు. వివరాల్లోకి వెళితే తమిళ హీరో జయం రవి హీరోగా నటించిన భూమి అనే సినిమా నిన్న సంక్రాంతి సందర్భంగా డిస్నీ హాట్ స్టార్ యాప్ లో రిలీజ్ అయింది. ఆర్గానిక్ వ్యవసాయం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమరావతి రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు.  దీంతో మన తెలుగు సినిమా హీరోలు దేనికీ పనికి రారు అంటూ ఈయన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని అమరావతి రైతులు, వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.




అనంతపురంలో అరుదైన పక్షి.. చూస్తే భయపడతారు..?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>