MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitara2ce300f4-10b2-4dd6-bb78-ee48fe7e5356-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitara2ce300f4-10b2-4dd6-bb78-ee48fe7e5356-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరం మొత్తం ప్రపంచం స్తంభించి పోయింది. సామాన్యులు నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరూ కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే 2020 చివరకు వచ్చే సరికి కొంచెం కొంచెంగా ప్రపంచం మొత్తం ప్రయాణాలు నెమ్మదిగా మొదలయ్యాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మన హీరోలు sitara;mahesh;govinda;gautham new;gautham;geetha;govi;parasuram;ram pothineni;sithara;spain;cinema;rajani kanth;media;2020;industry;europe countries;yatra;chitramస్పెయిన్‌లో మహేష్ బాబు పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా?స్పెయిన్‌లో మహేష్ బాబు పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా?sitara;mahesh;govinda;gautham new;gautham;geetha;govi;parasuram;ram pothineni;sithara;spain;cinema;rajani kanth;media;2020;industry;europe countries;yatra;chitramFri, 15 Jan 2021 23:32:19 GMT2020 సంవత్సరం మొత్తం ప్రపంచం స్తంభించి పోయింది. సామాన్యులు నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరూ కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే 2020 చివరకు వచ్చే సరికి కొంచెం కొంచెంగా ప్రపంచం మొత్తం ప్రయాణాలు నెమ్మదిగా మొదలయ్యాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మన హీరోలు చాన్స్ దొరికితే ఏదో ఒక వెకేషన్‌కు వెళ్లిపోతూ ఉంటారు. కొంత మంది సోలోగా ట్రిప్‌లు వస్తే మరి కొంత మంది తమ కుటుంబంతో పాటు కలిసి వెళ్తారు. ఎక్కువగా వెకేషన్‌లకు వెళ్లే వారిలో ముందు వరుసలో ఉండే నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అవును.. మహేష్ బాబు తనకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా సరే ఫ్యామిలీతో కలిసి విదేశీ యాత్రలకు వెళ్లిపోతారు. ఇటీవలే ఆయన ఓ విదేశీ యాత్రకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో తాను, తన సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కలిసి బీచ్‌లో గవ్వలతో ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఫొటో పెట్టి గతేడాది సమ్మర్‌లో తమ కుటుంబం మొత్తం స్పెయిన్ వెకేషన్‌కు వెళ్లినట్టు చెప్పింది. ప్రతి సమ్మర్‌కు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఏదో ఒక దేశానికి చెక్కేస్తారు. 2020లో కరోనా మహమ్మారి ఉండటంతో ఆయన విదేశీ యాత్ర చేయలేకపోయారు.

కానీ.. ఈ సారి మాత్రం ఆయన మళ్లీ ఏదో ఒక దేశానికి ఫ్యామిలీతో వెళ్లనున్నారని.. ఈ సారి కూడా యూరప్ ట్రిప్‌కు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అనేక దేశాల్లో మొదలై పోయింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించేశాయి. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


పాపం.. పాకిస్తాన్.. అంతర్జాతీయంగా ఘోరంగా అవమానించిన మలేసియా?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

‘వకీల్ సాబ్’ క్రెడిట్ మొత్తం అతనికేనా?.. ఫ్యాన్స్ ఏమంటున్నారు?

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

‘ఆర్ఆర్ఆర్’ టీంపై సెటైర్.. సినిమా యూనిట్ కూడా ఫిదా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>