TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/home-loans806c1e35-5ad7-4935-9d6f-7be649fac092-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/home-loans806c1e35-5ad7-4935-9d6f-7be649fac092-415x250-IndiaHerald.jpgఏటీఎం, స్వైపింగ్ మెషీన్లను ఉపయోగించే సమయంలో కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని భారత్ లోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ సూచనలను పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడే సమయంలో పాటించాల్సిన కొన్ని అతి ముఖ్యమైన భద్రతా నియమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతా దారులకు సూచిస్తూ ఈ ప్రకటన చేసింది. sbi;delhi;india;sbi;smart phone;bank;cheque;customerఏటీయం కార్డులు వాడే వాళ్లకు ముఖ్యమైన సూచనలు చేసిన ఎస్‌బీఐఏటీయం కార్డులు వాడే వాళ్లకు ముఖ్యమైన సూచనలు చేసిన ఎస్‌బీఐsbi;delhi;india;sbi;smart phone;bank;cheque;customerFri, 15 Jan 2021 16:53:52 GMTభారత్ లోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ సూచనలను పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడే సమయంలో పాటించాల్సిన కొన్ని అతి ముఖ్యమైన భద్రతా నియమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతా దారులకు సూచిస్తూ ఈ ప్రకటన చేసింది. సురక్షితమైన లావాదేవీలు జరగడానికి ఎస్‌బీఐ జాగ్రత్తలు తీసుకుంటోందని, కానీ సైబర్ క్రైంలు చేసే నిందితులు ఈ జాగ్రత్తలను తప్పించుకొని మోసాలకు పాల్పడేందుకు వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎస్‌బీఐ తెలిపింది. ఇలాంటి సందర్భంలో ఖాతాదారులు తగిన భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, లేదంటే సైబర్ క్రైం నిందితుల చేతిలో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.


ఇంతకీ ఎస్‌బీఐ తన ఖాతా దారులకు ఇచ్చిన సూచనలేంటో చూద్దామా?.. అవి ఇవీ..

1. ఏటీఎం, స్వైపింగ్ మెషీన్లలో మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డ్ ఎంటర్ చేసే సమయంలో మీ చేతిని అడ్డుగా పెట్టడం మంచిది.

2. ఏటీఎం కార్డు పిన్‌ నంబర్‌ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు.

3. ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ ను మీ కార్డుపై రాసుకోవడం అంటే దాన్ని ఇతరులకు ఇచ్చేయడమే. కాబట్టి ఈ పని అస్సలు చేయొద్దు.

4. మీ ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పాలంటూ వచ్చే ఫోన్ కాల్స్, ఈ - మెయిల్స్, మెసేజిలకు స్పందించక పోవడం ఉత్తమం.

5. మీ మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్‌ వంటి సులభంగా దొరికిపోయే అంకెలను మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డుగా పెట్టుకోవద్దు.

6. మీ ట్రాన్సాక్షన్ కాపీ పేపర్‌ను చించి చెత్త బుట్టలో పడేయండి.

7. మీ ట్రాన్సాక్షన్ మొదలు పెట్టే ముందే ఏమైనా స్పై కెమెరాలు ఉన్నాయేమో ఏటీయంలో ఓ సారి చెక్ చేసుకోండి.

8. ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌ను ఖాతాకు యాడ్ చేసుకోండి.


ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>