Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whether-to-attend-the-swearing-in-or-notccb0de0a-2a01-488f-8252-1f2d384942a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whether-to-attend-the-swearing-in-or-notccb0de0a-2a01-488f-8252-1f2d384942a8-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాకు వరుసగా షాకుల ఇస్తూనే వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా చైనాను ఒక శత్రుదేశం గానే భావిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దొడ్డదారులు తొక్కుతున్న చైనా ఆటలు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో అధికారంలో ఉన్నన్ని రోజులు అమెరికాకు తిప్పలు తప్పలేదు అన్న trump;india;american samoa;donald trump;cheque;oil;sea;shatru1పోతూ పోతూ చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లందరూ వెనక్కి..?పోతూ పోతూ చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లందరూ వెనక్కి..?trump;india;american samoa;donald trump;cheque;oil;sea;shatru1Fri, 15 Jan 2021 08:30:00 GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాకు వరుసగా షాకుల ఇస్తూనే వస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా చైనాను ఒక శత్రుదేశం గానే భావిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికాను  వెనక్కి నెట్టి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దొడ్డదారులు  తొక్కుతున్న చైనా ఆటలు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో అధికారంలో ఉన్నన్ని రోజులు అమెరికాకు తిప్పలు తప్పలేదు అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక అధ్యక్ష పదవి నుంచి తొలగిపోతున్న  నేపథ్యంలో ఇప్పటికి కూడా చైనా పై మరింత ప్రతీకారం తీర్చుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.



 ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దక్షిణ చైనా సముద్రంలో చైనా తీరు కు చెక్ పెట్టే విధంగా గతంలో  అమెరికా యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపడం తో..  భారత్-చైనా మధ్య కాదు అమెరికా చైనా మధ్య మొదట యుద్ధం జరుగుతుంది అని  అందరూ భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి.  ఇలా ఒక రకంగా చైనా పై కనిపించని యుద్ధమే చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరికొన్ని రోజుల్లో అధికారం నుంచి దిగిపోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.



 దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రాంప్ చర్యలు చేపట్టారు. చైనా కు చెందిన భారీ ఆయిల్ కంపెనీలో అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టకుండా ఆంక్షలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు చైనాతో ఎలాంటి వ్యాపారం కొనసాగకుండా నిషేధం విధించారు. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి వీడ్కోలు పలకనుండగా.. ఇక ట్రంప్ చైనా ఆటల కు చెక్ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇదే చివరిది కావడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి చైనా కు సంబంధించిన వ్యక్తులు వారి కుటుంబీకులకు కూడా ట్రావెల్ బ్యాన్ కొనసాగుతోంది.


అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>