SportsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-australiaa5bab68b-6f58-4779-88a7-387bbe3dd987-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-australiaa5bab68b-6f58-4779-88a7-387bbe3dd987-415x250-IndiaHerald.jpg బ్రిస్బేన్‌లో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో భార‌త జ‌ట్టు ఆసీస్‌పై పై చేయి సాధించే దిశ‌గా ప‌య‌నిస్తోంది. పెద్ద‌గా అనుభ‌వంలేని ఆట‌గాళ్లే జ‌ట్టులో ఎక్కువ‌గా ఉన్న భార‌త జ‌ట్టు ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. భారత్-ఆసీస్ ఈరోజు ప్రారంభమైన 4వ టెస్ట్ లో మొదటి సెషన్ పూర్తయ్యింది. టీమ్‌ఇండియాతో ఆడుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. భారత పేసర్లు సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ సాధించారు. అయితే అనుభవం లేని ఈ భారత బౌలర్లు పరుగులను కట్టడి చేస్తున్నారుindia vs australia;ravindra jadeja;shardul thakur;india;australia;joseph vijay;brisbane;butter;kollu ravindra;dalapathi;paruguనాలుగో టెస్టులో ఆసీస్‌పై పై చేయి సాధించిన భార‌త్‌...నాలుగో టెస్టులో ఆసీస్‌పై పై చేయి సాధించిన భార‌త్‌...india vs australia;ravindra jadeja;shardul thakur;india;australia;joseph vijay;brisbane;butter;kollu ravindra;dalapathi;paruguFri, 15 Jan 2021 09:21:20 GMTఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.  భారత పేసర్లు సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ సాధించారు. అయితే అనుభవం లేని ఈ భారత బౌలర్లు పరుగులను కట్టడి చేస్తున్నారు... కానీ వికెట్లు సాధించలేకపోతున్నారు.  వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 35వ ఓవర్‌ తొలి బంతికి స్మిత్‌(36)  ఔటయ్యాడు. అతడు రోహిత్‌ శర్మ చేతికి చిక్కడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు లబుషేన్‌(35) కలిసి స్మిత్‌ 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.


ఇక మాథ్యూవేడ్‌ క్రీజులోకి రాగా ఆస్ట్రేలియా 35 ఓవర్లకు 91/3తో నిలిచింది.కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైన తర్వాత కూడా తమ ఆత్మవిశ్వాసానికిలోటు లేదని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చుతున్నారు. చివరి టెస్టు డ్రాగా నిలిచిన సిరీస్ సమం అవుతుంది. సొంతగడ్డపై టీమిండియా చేతిలో సిరీస్‌ను చేజార్చుకోరాదని అసీస్ భావిస్తోంది. ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్‌లో పరాజయం, టి20ల్లో సిరీస్‌ విజయం తర్వాత టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగింది. ట్రాక్ రికార్డును ఓ సారి ప‌రిశీలిస్తే బ్రిస్బేన్‌లో 6 టెస్టులు ఆడిన భారత్‌ ఒక్కటి కూడా గెలవలేదు. 5 ఓడి 1 మ్యాచ్‌ డ్రా చేసుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 62 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్‌ 8 మాత్రమే ఓడింది.


ఇదిలా ఉండ‌గా ఇక భార‌త జ‌ట్టును గాయాల బెడ‌ద భ‌య‌ప‌డుతోంది.  గాయాల కారణంగా జట్టులో కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మ్యాచ్‌లకు దూరమవుతున్నారు. తాజాగా పేస్‌ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో బ్రిస్బేన్‌ టెస్ట్‌ నుంచి అవుటయ్యాడు. అశ్విన్‌ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. కనీసం వంగడానికి శరీరం సహకరించకపోయినా అశ్విన్‌ సిడ్నీలో బ్యాటింగ్‌ చేశాడు. దీనికితోడు ఆసీస్‌ పేసర్లు విసిరిన షార్ట్‌ బాల్స్‌ శరీరానికి తగలడంతో మరింత విలవిల్లాడాడు. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆసీస్‌ బౌలర్లను నిలువరించిన బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి కూడా తొడకండర గాయమైంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేలు ఫ్రాక్చర్‌ కావడంతో సిరీ్‌సకు దూరమయ్యాడు.




`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>