CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/nizamabad-latest-crime-newsed2b029f-f66d-4ee2-979d-51ef3b5bb697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/nizamabad-latest-crime-newsed2b029f-f66d-4ee2-979d-51ef3b5bb697-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రొంపిచర్ల మండలం తంగళ్లపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి ప్రాణాపాయం తప్పింది. కాల్వ ఒడ్డున పార్టీ చేసుకుంటూ నీళ్లలో ఓ వ్యక్తి పడిపోగా.. అతన్ని కాపాడేందుకు వెళ్లి మరో నలుగురు వ్యక్తులు మునిగిపోయారు. అందులో రామాంజనేయులు (40), శ్రీను (40) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. బాధితులను వెలవవారి పcrime;kranthi;kranti;makar sakranti;godavari river;krishna river;guntur;telangana;sankranthi;west godavari;police;festival;local language;bhimavaram;narasaraopet;petta;partyగుంటూరులో విషాదం.. పార్టీ చేసుకుంటూ కాలువ‌లో ప‌డి ఇద్ద‌రి మృతి...గుంటూరులో విషాదం.. పార్టీ చేసుకుంటూ కాలువ‌లో ప‌డి ఇద్ద‌రి మృతి...crime;kranthi;kranti;makar sakranti;godavari river;krishna river;guntur;telangana;sankranthi;west godavari;police;festival;local language;bhimavaram;narasaraopet;petta;partyFri, 15 Jan 2021 10:05:06 GMTపార్టీ చేసుకుంటూ నీళ్లలో ఓ వ్యక్తి పడిపోగా.. అతన్ని కాపాడేందుకు వెళ్లి మరో నలుగురు వ్యక్తులు మునిగిపోయారు. అందులో రామాంజనేయులు (40), శ్రీను (40) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. బాధితులను వెలవవారి పాలెంనకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


ఇదిలా ఉండ‌గా సంక్రాంతి పండుగ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో అంబ‌రాన్నంటింది. పందెం కోళ్లు కాలు దువ్వాయి. ఓ వైపు పోలీసులు పందాలపై నిఘా ఉంచినా మరోవైపు పందెం రాయుళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు. దాంతో ఏపీలో కోడి పందాలతో పాటు గుండాట, పేకాట కూడా విచ్చలవిడిగా జరుగుతోంది. పెద్దపండుగ వేళ పందేనికి సై అంటూ యధేచ్చగా బరులు మొదలెట్టారు పందెంరాయుళ్ళు. దానికి తోడు గుండాట, పేకాట, సహా అనేక జూద క్రీడలు సైతం ప్రాణం పోసుకున్నాయి. ఊపిరి తీసేసామనుకున్న పోలీసులు ఆశ్చర్యపడేలా పందెం బరులు మొదలయ్యాయి. వెయ్యితో మొదలైన పందెం లక్షల్లో చేరడంతో ఈ ఏడాది కూడా కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తేటతెల్లం చేస్తున్నాయి.


ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోడి పందాలకు ఫేమస్ అయిన భీమవరంలోనూ కోళ్ల కొట్లాట జోరందుకుంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మ‌ద్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల్లోకి అనుమ‌తిలేకుండా దిగుమ‌త‌వ‌డం గ‌మ‌నార్హం. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం జొన్నలగడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 4,944 సీసాల తెలంగాణ మద్యం పట్టుబడింది. లారీతో పాటు మూడు కార్లు, ఒక ఆటోను సెబ్ పోలీసులు సీజ్ చేశారు. మద్యాన్ని తరలిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>