PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జంట నగరాలకు పరిమితమైన పార్టీ, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీ ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ వస్తుంది.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తూ వస్తుంది. దీనిపై అనే రకాల ఆరోపణలే ఉన్నాయి.. బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికే ఎంఐఎం అధినేత అన్ని చోట్ల పోటీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితేbjp;deva;hyderabad;bharatiya janata party;telangana;west bengal - kolkata;sakshi maharaj;congress;mp;assembly;mim party;sakshi;partyఎంఐఎం వల్లే అక్కడ బీజేపీ గెలిచింది....!?ఎంఐఎం వల్లే అక్కడ బీజేపీ గెలిచింది....!?bjp;deva;hyderabad;bharatiya janata party;telangana;west bengal - kolkata;sakshi maharaj;congress;mp;assembly;mim party;sakshi;partyThu, 14 Jan 2021 14:04:22 GMTతెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జంట నగరాలకు పరిమితమైన పార్టీ, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీ ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ వస్తుంది.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తూ వస్తుంది. దీనిపై అనే రకాల ఆరోపణలే ఉన్నాయి.. బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికే ఎంఐఎం అధినేత అన్ని చోట్ల పోటీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. త‌రచూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే ఆయ‌న తాజాగా ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి మాట్లాడారు. ఎంఐఎం వ‌ల్లే బీజేపీ బీహార్‌లో ఓట్లు చీల్చి అత్య‌ధిక స్థానాలు గెలుపొందింద‌ని తెలిపారు.


వెస్ట్ బెంగాల్‌‌తోపాటు ఉత్తర్ ప్రదేశ్‌‌లో జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే తమకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై సాక్షి మహారాజ్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయన పార్టీ పోటీ చేస్తే వారి కంటే తమకే ఎక్కువ ప్రయోజనమని తెలిపారు. ‘ఇది దేవుడి దయ. అసదుద్దీన్ ఒవైసీకి దేవుడు బలం చేకూర్చాలి. బిహార్ ఎన్నికల్లో ఆయన మాకు సాయం చేశారు.ఆయా రాష్ర్టాల్లో బీజేపీ గెలుపున‌కు ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తోడ్పాటు అందిస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారాయన.. ఇక, ఎంఐఎం వ‌ల్లే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్నా ఆయన.. త్వరలో జ‌ర‌గ‌బోయే పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక‌ల్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తుందంటూ ప్రకటించారు బీజేపీ ఎంపీ. దీంతో.. అక్కడ కూడా బీజేపీ గెలుపుకు అసదుద్దీన్ ఒవైసీ స‌హ‌క‌రించ‌బోతున్నారంటూ వ్యాఖ్యానించిన సంచలనానికి తెరలేపారు.


ఎంఐఎం పోటీ చేసి ఓట్లు చీల్చుతూ బీజేపీకి ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తోంద‌ని కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే‌. ప‌శ్చిమ బెంగాల్ ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ పోటీ చేయ‌నున్న అన్ని పార్టీలు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకున్నాయి.మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం స్థానాల్లో కూడా ఎంఐఎం పార్టీ పోటీకి సిద్ధమవుతూ..అదే రాష్ట్రానికి చెందిన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భార్‌తో ఒవైసీ చర్చలు జరిపారు. రెండు పార్టీలు కలిసి పోటీకు దిగుతున్నట్టు ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు..బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.


టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>