HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/calcium-aharam-3a67353f-9910-45b4-8011-3c24bf6f45e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/calcium-aharam-3a67353f-9910-45b4-8011-3c24bf6f45e1-415x250-IndiaHerald.jpgకాల్షియం మన శరీరంలో ఎముకల దృఢత్వానికి,పళ్ళు పటిష్టంగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. కానీ ఆ కాల్షియం మన శరీరానికి ఏ విధంగా లభిస్తుందో మాత్రం చాలామందికి తెలియదు. క్యాల్షియం కేవలం ఎముకలకు, పళ్లకు మాత్రమే కాకుండా శరీరంలో ఎన్నో రోగాలను అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ప్రత్యేకంగా ఏ ఏ ఆహార పదార్థాలలో ఏ విధంగా మనకు లభిస్తుందో ఇక్కడ ఇప్పుడు చూద్దాం. calcium,aharam,;vitamin c;vitamin;heart;almonds;manamఏ ఏ ఆహార పదర్థాలలో కాల్సియం పుష్కళంగా లభిస్తుందో తెలుసా?ఏ ఏ ఆహార పదర్థాలలో కాల్సియం పుష్కళంగా లభిస్తుందో తెలుసా?calcium,aharam,;vitamin c;vitamin;heart;almonds;manamThu, 14 Jan 2021 10:28:56 GMTకాల్షియం మన శరీరంలో ఎముకల దృఢత్వానికి,పళ్ళు పటిష్టంగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. కానీ ఆ కాల్షియం మన శరీరానికి ఏ విధంగా లభిస్తుందో మాత్రం చాలామందికి తెలియదు. క్యాల్షియం కేవలం ఎముకలకు, పళ్లకు మాత్రమే కాకుండా శరీరంలో ఎన్నో రోగాలను అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ప్రత్యేకంగా ఏ ఏ  ఆహార పదార్థాలలో ఏ విధంగా మనకు లభిస్తుందో ఇక్కడ  ఇప్పుడు చూద్దాం.

క్యాల్షియం మన శరీరంలో కండరాలు, నాడులు,కణాలు సరిగ్గా  పనిచేసేలా చేస్తుంది.అంతేకాకుండా రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ఎక్కువగా పాలలో ఉంటుంది.పాలతోపాటు  పాలతో తయారైన పదార్థాలలో  ల్యాక్టోజ్ పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో క్యాల్షియం పెరిగేలా చేస్తుంది. ఎండిన అంజూర పండ్లు తినడం వల్ల వాటి నుండి 121 మిల్లీగ్రాముల కాల్షియం మన శరీరానికి లభిస్తుంది.ఇందులో పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కండరాల పని తీరును,గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఇక నారింజ పండులో 74 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అంతేకాకుండా వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. చేపలను  120 గ్రాములు చొప్పున తీసుకుంటే అందులో 351 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి 12,విటమిన్ డి కూడా లభిస్తుంది.బెండకాయకు మలబద్దకాన్ని నివారించే పీచుతో నిండిన కాయ కూర. బెండకాయలను ఒక కప్పు తీసుకుంటే 82 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అంతేకాకుండా వీటిలో పోలేట్,విటమిన్ బి6, విటమిన్ డి లు ఉన్నాయి.

బాదం పప్పుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. అయితే 30 గ్రాముల బాదం పప్పులలో  75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తింటేనే అంత స్థాయిలో క్యాల్షియం లభిస్తుంది.అంతేకాకుండా విటమిన్ ఈ, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తున్నాయి.




సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>