Half Stories Movie First Look Poster Released

హాఫ్ స్టోరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!

రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివవరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం "హాఫ్ స్టోరీస్". షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా శివవరప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాఫ్ స్టోరీస్ టైటిల్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తూంది. కోటి సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. అలాగే ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంగీతం; కోటి, డివోపి; చైతన్య కందుల, ఎడిటర్; సెల్వకుమార్, దర్శకత్వం; శివ వర ప్రసాద్ కె, నిర్మాత; యం. సుధాకర్ రెడ్డి.

 

Facebook Comments

About Harsha