Businessyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/signal-and-telegram-downloads-hiked-61-percent36e6f791-ca95-4817-8ca3-97936c775bc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/signal-and-telegram-downloads-hiked-61-percent36e6f791-ca95-4817-8ca3-97936c775bc2-415x250-IndiaHerald.jpgవాట్సాప్ చేసిన ఓ చిన్న తప్పు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ దెబ్బతో వాట్సాప్‌కు ఆల్టర్నేటివ్ అప్లికేషన్లయిన టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా అప్లికేషన్ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. దీంతో కొత్త ప్రైవసీ పాలసీపై..whats app;bindu;bindhu;whatsapp;january;media;social media;central government;marchభారీగా పెరిగిన సిగ్నల్‌, టెలిగ్రాం డౌన్‌లోడ్లు.. ఎంత భారీగా పెరిగాయంటే..!భారీగా పెరిగిన సిగ్నల్‌, టెలిగ్రాం డౌన్‌లోడ్లు.. ఎంత భారీగా పెరిగాయంటే..!whats app;bindu;bindhu;whatsapp;january;media;social media;central government;marchThu, 14 Jan 2021 23:27:47 GMTఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ చేసిన ఓ చిన్న తప్పు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ దెబ్బతో వాట్సాప్‌కు ఆల్టర్నేటివ్ అప్లికేషన్లయిన టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా అప్లికేషన్ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. దీంతో కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్ మరోసారి స్పష్టత ఇచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన సందేశాల గోప్యతను తాజాగా తీసుకువచ్చిన మార్పులు ఏ విధంగానూ ప్రభావితం చేయవని తెలిపింది. కొత్త పాలసీపై చక్కర్లు కొడుతున్న వదంతులను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని హామీ ఇచ్చింది.

వాట్సాప్‌ తాజాగా తన సెక్యూరిటీ విధానాలను మార్చింది. ఈ విధానాల ప్రకారం.. ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డేటాను వారి వారి ఫేస్‌బుక్ ఖాతాలకు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. దీంతో వినియోగదారులకు ఆగ్రహం వచ్చింది. ఈ కొత్త విధానంపై ఎలాన్ మస్క్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సిగ్నల్ యాప్’ను వాడుకోవాలని సలహా ఇచ్చాడు. అంతే వాట్సాప్ వినియోగదారులు పడిపోవడం, సిగ్నల్ వినియోగదారులు మిలియన్లలో పెరిగిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోయింది.

తప్పు తెలుసుకున్న వాట్సాప్ తన నిబంధనలను సవరించింది. కానీ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ మధ్య గూగుల్‌, యాపిల్‌ స్టోర్ల నుంచి సిగ్నల్‌ యాప్‌ను 17.8 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, మునుపటి వారంలోని 2,85,000 డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదలని మొబైల్‌ యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్‌ తెలిపింది.

ఇక సిగ్నల్‌ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కూ భారీగా డిమాండ్ పెరిగింది. 5వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య 15.7 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదైనట్లు తెలుస్తోంది. అంతకుముందు వారం 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇక వివాదానికి కేంద్ర బిందువైన వాట్సాప్‌కు‌ అంతకు ముందువారం 12.7 మిలియన్ల డౌన్‌లోడ్లు ఉండగా జనవరి 5-12 మధ్య 10.6 మిలియన్లకు తగ్గాయి. ఇదంతా చూస్తుంటే సంప్రదాయ సోషల్‌ మీడియా వినియోగదారులు ప్రస్తుత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


పవర్ స్టార్ ఫ్యాన్స్ రికార్డుని ఆపాలని చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్...

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>