Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/glowing-skin38c7538e-be9a-4467-bec9-c147e0917151-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/glowing-skin38c7538e-be9a-4467-bec9-c147e0917151-415x250-IndiaHerald.jpgమారుతున్న కాలానుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. దానికి తోడు సీజన్లో వచ్చే వ్యాధులు , వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి వంటి అనేక సమస్యలతో నిత్యం కుస్తీ పడుతూనే ఉన్నాడు. అలాంటి సమస్య లో చర్మ సమస్యలు ముఖ్యమైనవి. మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఎంతో ఖర్చుతో కూడిన ఫేస్ క్రీములు, ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన శరీరంపై వేరే సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల సహజసిద్ధంగా శరీర కాంతిని మెరుగు పరిచే పద్ధతులను పాటించడం మంచిది.glowing,skin;meenakshi;soundarya;nithya new;makeupఈ చిట్కాలు పాటిస్తే అందమైన, కాంతివంతమైన ముఖ ఛాయ మీ సొంతం!ఈ చిట్కాలు పాటిస్తే అందమైన, కాంతివంతమైన ముఖ ఛాయ మీ సొంతం!glowing,skin;meenakshi;soundarya;nithya new;makeupThu, 14 Jan 2021 02:00:00 GMTసౌందర్య సాధనంగా  చాలా కాలం నుండి ఉపయోగిస్తున్నారు.దాదాపు ప్రతి ఇంట్లో ఉండే వంటసోడాను తినే సోడా, బేకింగ్ సోడా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం సోడియం బై కార్బనేట్ ముఖ్యంగా దీన్ని వివిధ రకాల పిండి వంటల్లో ఉపయోగిస్తారు.

 సహజంగా ఎండలోకి వెళ్లినప్పుడు మనల్ని కాపాడేందుకు చర్మం మెలనిన్ అనే నల్లటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల స్కిన్ గ్లో పోతుంది. ఇలా వచ్చిన మెలనిన్‌ను సహజ సిద్ధంగా తొలగించే లక్షణం  వంట సోడా లో ఉంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

మొదట టేబుల్ స్పూన్ వంట సోడా  తీసుకోండి. దాన్లో నీరు, వెనిగర్ కలిపి పేస్టులా చెయ్యండి. దీన్ని స్కిన్‌పై రాసుకోండి .ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి అది ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా నల్లబడిన శరీరాన్ని తెల్లబరుస్తుందని ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మీనాక్షి దత్ చెప్పారు.

బేకింగ్ సోడా లో యాంటి-ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, దురద, మంటలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో తినేసోడా వేసి  4 లేదా 5 నిమిషాలు తక్కువ మంటలో ఉడికించండి. వచ్చిన క్రీమును రోజుకు 2 సార్లు చొప్పున రాసుకుంటే చర్మం మృదువుగా, దద్దుర్లు లేకుండా మారిపోతుంది.

కొంత మందికి చర్మంపై ముడతలు  చిన్న కన్నాలలా ఏర్పడి, అక్కడ మట్టి పేరుకుపోయి సమస్యగా మారుతుంది. అలాంటి చోట బేకింగ్ సోడా రాస్తే, అది చర్మాన్ని లూజ్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఆ మట్టి బయటకి వచ్చేస్తుంది.

శరీరంపై ఏర్పడిన నల్లటి మచ్చలు మరణాలు అడుగు తొలగిపోవాలంటే  నీరు లేదా రోజ్ వాటర్‌లో 2 టీ స్పూన్ల వంట సోడా కలిపి దాన్ని ముఖానికి రాసుకొని ఓ నిమిషం అలా వదిలేయండి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే చర్మంపై మచ్చలు, మలినాలూ పోతాయి.

ఒక స్పూన్ బేకింగ్ సోడాకు సమానంగా నిమ్మరసం కలిపి గట్టి మిశ్రమంగా తయారుచేసి అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్ల, మెడ భాగంలో ఆ మిశ్రమాన్ని  పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే  నల్లగా ఉండే మచ్చలు తొలగిపోతాయి.

ఈ విధంగా మన ఇంట్లో దొరికే వంట సోడా తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అని కొందరు వైద్యులు చూపిస్తున్నారు.


బై పోల్ వార్: జగన్ సూపర్ స్కెచ్...బీజేపీ ఉంటేనే బెన్‌ఫిట్...

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>