PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/husband-killed-wife-for-amma-vodi-amount-in-ap302c690d-cbdf-42ed-8ca5-c61f6fd59250-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/husband-killed-wife-for-amma-vodi-amount-in-ap302c690d-cbdf-42ed-8ca5-c61f6fd59250-415x250-IndiaHerald.jpgఅమ్మఒడి పథకం ఓ అమ్మ ఉసురు తీసింది. అమ్మఒడి డబ్బులకోసం ఏకంగా భార్య ప్రాణాలే తీశాడు ఓ భర్త. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఉదంతం విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోటలో జరిగింది. అమ్మఒడి డబ్బుల్ని వృథా కానివ్వకుండా పిల్లలకోసం దాచిపెట్టడమే ఆ అమ్మ చేసిన తప్పయింది. పిల్లల భవిష్యత్ కోసం భర్తతో సైతం వాదులాడింది. చివరకు ప్రాణాలే కోల్పోయింది. amma vodi;kranthi;kranti;makar sakranti;rbi;district;sankranthi;vishakapatnam;police;panchayati;husband;wife;local language;ammavodiఅమ్మఒడి వల్లే ఆ అమ్మ చనిపోయింది..అమ్మఒడి వల్లే ఆ అమ్మ చనిపోయింది..amma vodi;kranthi;kranti;makar sakranti;rbi;district;sankranthi;vishakapatnam;police;panchayati;husband;wife;local language;ammavodiThu, 14 Jan 2021 10:00:00 GMTఅమ్మఒడి పథకం ఓ అమ్మ ఉసురు తీసింది. అమ్మఒడి డబ్బులకోసం ఏకంగా భార్య ప్రాణాలే తీశాడు ఓ భర్త. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఉదంతం విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోటలో జరిగింది. అమ్మఒడి డబ్బుల్ని వృథా కానివ్వకుండా పిల్లలకోసం దాచిపెట్టడమే ఆ అమ్మ చేసిన తప్పయింది. పిల్లల భవిష్యత్ కోసం భర్తతో సైతం వాదులాడింది. చివరకు ప్రాణాలే కోల్పోయింది.

మద్యానికి బానిసైన భర్త భీమన్న.. తాగడానికి అమ్మఒడి సొమ్మున ఇవ్వలేదనే కారణంతో భార్య దేముడమ్మను బండతో కొట్టి చంపాడు. విశాఖ జిల్లా గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ ‌డ్రా చేయాలని భర్త భీమన్న ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి దేముడమ్మ ససేమిరా అంది. పిల్లల భవిష్యత్ కోసం, వారి విద్యావసారకోసం డబ్బులు వాడాలని, తాగడానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. సంతనుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆమెను బండతో కొట్టి చంపేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

లక్షలమంది తల్లుల జీవితాల్లో వెలుగులు నింపి సంక్రాంతి పండగను రెండు రోజుల ముందుగానే ఇంటికి తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఒక తల్లి ఉసురు తీయడం స్థానికంగా కలకలం రేపింది. అమ్మఒడి సొమ్ము ఇచ్చినట్టే ఇచ్చి లేకపోయినా ఆ కుటుంబంలో కలతలు లేకుండా ఉండేవని అంటున్నారు కొంతమంది. తల్లిలేని అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి సొమ్ములు అందుకున్నకుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. పండగలకు పిల్లలకు కొత్త బట్టలతో సహా.. ఇతర అనేక అవసరాలకు అమ్మఒడి అండగా ఉందని, తమ ఆర్థిక అవసరాలు తీర్చిందని సంతోషపడుతున్నారు లబ్ధిదారులు. 


వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>