Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/england-has-the-record-of-playing-two-matches-against-two-contries-on-the-same-day71b07fcd-4f39-4ebb-bae1-b95f85b72c57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/england-has-the-record-of-playing-two-matches-against-two-contries-on-the-same-day71b07fcd-4f39-4ebb-bae1-b95f85b72c57-415x250-IndiaHerald.jpgక్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డుల్లో కొన్నింటిని ఆటగాళ్లు తిరగరాశారు. కొన్ని ఇప్పటికీ చెరగని రికార్డుగానే మిగలిపోయి ఉన్నాయి. అలాంటి ఓ రికార్డే ఇంగ్లండ్ పేరుమీదుంది. అందేంటంటే...england cricket;cricket;england;west indies;paruguఒకేసారి రెండు దేశాల్లో రెండు జట్లతో మ్యాచ్.. చరిత్రలోనే తొలిసారి..ఒకేసారి రెండు దేశాల్లో రెండు జట్లతో మ్యాచ్.. చరిత్రలోనే తొలిసారి..england cricket;cricket;england;west indies;paruguThu, 14 Jan 2021 10:00:00 GMTక్రికెట్ ఆడిన రికార్డు. చరిత్రలో ఇప్పటివరకు ఈ రికార్డు ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే సాధించింది.

1930 జనవరిలో న్యూజిల్యాండ్ తొలిసారిగా టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌తో పోటీకి సిద్ధమైంది. అయితే పటిష్ఠ ఇంగ్లండ్ ముందు నిలవలేకపోయింది. దీంతో మ్యాచ్ ఆసాంతం ఇంగ్లండ్ జట్టే పైచేయిగా నిలిచింది. చివరికి గెలుపును కూడా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇంగ్లండ్ జట్టు ఇక్కడ న్యూజిల్యాండ్‌తో గెలుస్తుండగా.. సుదూరంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదుర్కొంది.

చరిత్రలో ఇలా ఒకే దేశానికి చెందిన రెండు జట్లు ఒకే సమయంలో వేరు వేరు దేశాల్లో ఆ దేశ జట్లతో క్రికెట్ ఆడిన అరుదైన ఘనత ఇంగ్లండ్‌కు మాత్రమే సొంతమైంది. అయితే ఆ తరువాత ఇలా ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించే జట్టు రెండు జట్లతో క్రికెట్ ఆడడాన్ని మిగతా దేశాలు వ్యతిరేకించాయి. దీంతో ఇలా ఆడడం కనుమరుగైపోయింది.

ఇదిలా ఉంటే ఆ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ అద్భుతంగా పోరాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులు చేసి అదరగొట్టింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో వైపు వెస్టిండీస్‌-ఇంగ్ండ్ మధ్య మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్ వెస్టిండీస్ 369 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అయితే చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.


వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>