PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide235575eb-ca41-44a9-a83e-3b9269694c4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide235575eb-ca41-44a9-a83e-3b9269694c4f-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది అమ్మాయి జీవితంలో జరిగే గొప్ప వేడుక. కట్టుకున్న వాడి కోసం కన్నవారిని కాదనుకొని మెట్టినింట్లో అడుగు పెడుతారు. ఇక ఎన్నో ఆశలతో వారి కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువకుడు శోభనం రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. suicide;shobhana;jeevitha rajaseskhar;puri jagannadh;tara;smart phone;police;nalgonda;village;marriage;air;girl;murder.;local languageవిషాదం: శోభనం రోజే పెళ్ళికొడుకు ఆత్మహత్య.. ఎందుకంటే..!?విషాదం: శోభనం రోజే పెళ్ళికొడుకు ఆత్మహత్య.. ఎందుకంటే..!?suicide;shobhana;jeevitha rajaseskhar;puri jagannadh;tara;smart phone;police;nalgonda;village;marriage;air;girl;murder.;local languageThu, 14 Jan 2021 21:00:00 GMTపెళ్లి అనేది అమ్మాయి జీవితంలో జరిగే గొప్ప వేడుక. కట్టుకున్న వాడి కోసం కన్నవారిని కాదనుకొని మెట్టినింట్లో అడుగు పెడుతారు. ఇక ఎన్నో ఆశలతో వారి కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువకుడు శోభనం రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్న కుమారుడు సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. సంప్రదాయం ప్రకారం 11వ రోజైన మంగళవారం రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్లిన సోమేశ్ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

అయితే రాత్రి కావడంతో స్నేహితులంతా ఎవరింటికి వారు వెళ్లిపోగా..సోమేశ్ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రంతా సోమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు తెల్లవారుజామున అతడి స్నేహితుల ఇంటికి వెళ్లి వాకబు చేయగా తమ ముందే ఇంటికి బయలుదేరాడని చెప్పారు. దీంతో వారు గ్రామంలో గాలించగా పూరింట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోభనం రోజు రాత్రే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటు బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.




కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం తాగొచ్చా?

ఆ ఆలయంలో తలకిందులుగా శివుడు.. తెలుగు రాష్ట్రంలోనే!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. అతనిపై ఎఫ్ఐఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>