PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-chandra-babufb133de5-75a1-4e8d-a29d-9357ac199ed5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-chandra-babufb133de5-75a1-4e8d-a29d-9357ac199ed5-415x250-IndiaHerald.jpg పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి ఏకైక మంత్రిగా నాని కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌, వైసీపీ అధిష్టానం మెప్పుకోసం నాని చంద్ర‌బాబు, టీడీపీపై ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంటారు. ఇక గుడివాడ ఒక‌ప్పుడు నంద‌మూరి కుటుంబానికి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రెండుసార్లు గెలిచారు. అలాంటి కంచుకోట‌.. ఇప్పుడు కొడాలి నాని కంచుకోట‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులkodali chandra babu;cbn;ntr;nani;kodali nani;amarnath cave temple;andhra pradesh;devineni avinash;mla;minister;cheque;letter;tdp;ycp;nandamuri taraka rama rao;partyకొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?kodali chandra babu;cbn;ntr;nani;kodali nani;amarnath cave temple;andhra pradesh;devineni avinash;mla;minister;cheque;letter;tdp;ycp;nandamuri taraka rama rao;partyThu, 14 Jan 2021 08:14:50 GMTఏపీ మంత్రి కొడాలి నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టీడీపీకి దూర‌మైన‌ప్ప‌టి నుంచే నాని చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాని మంత్రి అయిన వెంట‌నే చంద్ర‌బాబు, టీడీపీ, నారా లోకేష్‌తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటారు. అస‌లు నాని తిట్టే బూతులు విన‌లేని ప‌రిస్థితి. చివ‌ర‌కు నానికి కౌంట‌ర్ ఇచ్చే టీడీపీ నాయ‌కులు కూడా లేరు. ఎన్టీఆర్ ద‌య‌తో 2004లో గుడివాడ టీడీపీ సీటు ద‌క్కించుకున్న నాని.. త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యే అయ్యారు.

ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు ముందే చంద్ర‌బాబుతో విబేధించి వైసీపీలో చేరిన నాని ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నానిని టీడీపీ ఎన్నో విధాలుగా టార్గెట్ చేస్తూ వ‌చ్చింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓవ‌రాల్‌గా నాలుగోసారి గెలిచిన నాని ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి ఏకైక మంత్రిగా నాని కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌, వైసీపీ అధిష్టానం మెప్పుకోసం నాని చంద్ర‌బాబు, టీడీపీపై ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంటారు.

ఇక గుడివాడ ఒక‌ప్పుడు నంద‌మూరి కుటుంబానికి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రెండుసార్లు గెలిచారు. అలాంటి కంచుకోట‌.. ఇప్పుడు కొడాలి నాని కంచుకోట‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. నంద‌మూరి కుటుంబానికే చెందిన క‌ళ్యాణ్ రామ్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని.. అప్పుడే కొడాలికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబుకు కొంద‌రు సూచించిన‌ట్టు తెలుస్తోంది.

కొడాలి నానికి దివంగ‌త‌కు హ‌రికృష్ణ‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. నాని కూడా హ‌రికృష్ణ కుటుంబంపై ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేయ‌లేదు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన క‌ళ్యాణ్‌రామ్‌ను అక్క‌డ బ‌రిలోకి దించితే.. ఇటు నంద‌మూరి కుటుంబానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు ఉండ‌డంతో పాటు త‌మ కుంచుకోట‌లో కొడాలికి చెక్ పెట్టిన‌ట్ల‌వుతుంద‌న్న ఆలోచ‌న‌లో టీడీపీ వ‌ర్గాలు ఉన్నాయి. అటు హ‌రికృష్ణ కుటుంబానికి కూడా ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని సెంటిమెంట్ కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బాబుకు పార్టీ కీల‌క నేత‌లు సూచిస్తున్నార‌ట‌. 


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీతోనే తలనొప్పి ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>