PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhumaakhilapriya2759f3b4-83ce-46d5-bdd2-3464275e1feb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhumaakhilapriya2759f3b4-83ce-46d5-bdd2-3464275e1feb-415x250-IndiaHerald.jpgబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నించారు. దాదాపు మూడు రోజుల నుంచి భూమా అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కిడ్నాప్‌లో అసలు ఎవరెవరు పాల్గొన్నారు.. కిడ్నాప్ స్కెచ్ ఏంటి? ఈ కిడ్నాప్‌కు సంబంధించి bhumaakhilapriya;ram pothineni;hyderabad;lodha;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;air;husband;police station;traffic police;pettaభూమా అఖిల ప్రియకు మరో షాకిచ్చిన పోలీసులుభూమా అఖిల ప్రియకు మరో షాకిచ్చిన పోలీసులుbhumaakhilapriya;ram pothineni;hyderabad;lodha;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;air;husband;police station;traffic police;pettaThu, 14 Jan 2021 12:15:21 GMTభూమా అఖిల ప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నించారు. దాదాపు మూడు రోజుల నుంచి భూమా అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కిడ్నాప్‌లో అసలు ఎవరెవరు పాల్గొన్నారు.. కిడ్నాప్ స్కెచ్ ఏంటి? ఈ కిడ్నాప్‌కు సంబంధించి భూమా అఖిల ప్రియ పాత్ర ఎంత? భర్త భార్గవ్ రామ్ పాత్ర ఎంత అనే దానిపై మూడు రోజుల పాటు విచారించారు. అఖిల ప్రియ కిడ్నాప్‌కు సంబంధించి ఇచ్చిన కీలక సమాచారం ద్వారా ఈ కేసులో మిగిలిన నిందితులను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం రెండు గంటల్లోపు అఖిల ప్రియను బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

అనంతరం ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరుస్తారు. న్యాయమూర్తి ఎదుట హాజర పరిచిన తరువాత తిరిగి ఆమెను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి లోధా అపార్ట్ మెంట్ నుంచి బోయిన్ పల్లి స్పాట్ వరకు కిడ్నాపర్లు ఏ వివరాలు వదిలారో వాటన్నిటి గురించి భూమా అఖిల ప్రియను ప్రశ్నిస్తున్నారు. అయితే అఖిల ప్రియ కొన్ని విషయాలకు సంబంధించి నోరు విప్పలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఎక్కడుంది ఇంకా తెలియ రాలేదు.

తన భర్త ఎక్కడున్నాడనే దానిపై కూడా పోలీసులు భూమా అఖిల ప్రియను విచారిస్తున్నారు. కాగా.. పోలీసులు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మరో 15 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందుతులైన చంద్రహాస్, భార్గవ్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ లభిస్తే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు మొత్తం వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.  


లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?

నిమ్మగడ్డతో వైసీపీకి భారీ నష్టమేనా ? టీడీపీకి కలిసొచ్చేది ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>