PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా దూకుడుగా వెళ్ళడం ఏమో గానీ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నాసరే రమేష్ కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దీంతో సీఎం వైఎస్ జగన్ కూడా దీని మీద ఎక్కువగా దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా అయినా సరే అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దాదాపys jagan;kumaar;bharatiya janata party;jagan;andhra pradesh;high court;telugu;government;court;chief minister;local language;central government;supreme court;dookudu;partyజగన్ లో కోపం పెరిగిపోతుందా...?జగన్ లో కోపం పెరిగిపోతుందా...?ys jagan;kumaar;bharatiya janata party;jagan;andhra pradesh;high court;telugu;government;court;chief minister;local language;central government;supreme court;dookudu;partyThu, 14 Jan 2021 08:01:39 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా దూకుడుగా వెళ్ళడం ఏమో గానీ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నాసరే రమేష్ కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దీంతో సీఎం వైఎస్ జగన్ కూడా దీని మీద ఎక్కువగా దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా అయినా సరే అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

దాదాపుగా నాలుగు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ గా వ్యవహారం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు సహాయం చేయాలని గత కొన్ని రోజులుగా కోరుతూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని విషయాల్లో కూడా దాదాపు రెండేళ్ల నుంచి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు.

వ్యవసాయ చట్టాలు విషయంలోగాని అలాగే మరికొన్ని అంశాలు కానీ ముఖ్యమంత్రి జగన్ నుంచి కేంద్ర ప్రభుత్వంకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందుతూనే ఉన్నాయి. అయినా సరే ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జగన్ కు సహకారం అందించడం లేదని అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వద్దకు జగన్ వెళ్లగా రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతకుమించి సీఎం జగన్ కోసం కేంద్ర ప్రభుత్వం చేసినది ఏమీ లేదు. దీనితో జగన్ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>