MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan754c6af6-9c61-46de-9d34-808bbe89e931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan754c6af6-9c61-46de-9d34-808bbe89e931-415x250-IndiaHerald.jpgఈ రోజు ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు పుట్టిన రోజు. సంక్రాంతి వేళ పుట్టిన ఆయన తెలుగు సినీ రంగాన పండు వెన్నెలలే కురిపించారు. హీమాన్ అనిపించుకున్నారు. శోభన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఆయనకు అప్పట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సూపర్ గా ఉండేది. sobhan;geetha;jayalalitha;kranthi;kranti;sandhya;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;january;gold;chennai;evening;hero;heroine;march;athidhi;mass;railహీరోగా సెలెక్ట్ చేసి అతిధి పాత్ర ఇచ్చారు...!హీరోగా సెలెక్ట్ చేసి అతిధి పాత్ర ఇచ్చారు...!sobhan;geetha;jayalalitha;kranthi;kranti;sandhya;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;january;gold;chennai;evening;hero;heroine;march;athidhi;mass;railThu, 14 Jan 2021 12:00:00 GMTసంక్రాంతి వేళ పుట్టిన ఆయన తెలుగు సినీ రంగాన పండు వెన్నెలలే కురిపించారు. హీమాన్ అనిపించుకున్నారు. శోభన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఆయనకు  అప్పట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సూపర్ గా ఉండేది.

శోభన్ బాబు 1937 జనవరి 14న క్రిష్ణా జిల్లాలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనాచలపతిరావు. బీఎస్సీ చేసిన శోభన్ నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని మద్రాస్ రైల్ ఎక్కారు. ఆయన ఎన్నో ప్రయత్నాలు  చేసిన మీదటన తొలి చాన్స్ లభించింది. భక్త శబరి శోభన్ ఫస్ట్ మూవీ. ఆ తరువాత ఆయన ఎన్నో సినిమాల్లో చిన్న వేషాలు వేశారు. ఆయనకు స్టార్ డం రావడానికి ఏకంగా దశాబ్ద కాలం పైగా పోరాటం చేస్శారంటే నమ్మాల్సిందే.

ఇక శోభన్ నటుడిగా ఎంట్రీ ఇచ్చాక వచ్చిన సూపర్ స్టార్ క్రిష్ణ మొదటి సినిమా తేనే మనసులతోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. 1968న గూడచారి 116 సినిమాను తీస్తున్నపుడు మొదట అనుకున్న హీరో శోభన్ బాబు.  ఆ మూవీలో హీరోయిన్ జయలలిత. ఆమె తల్లి సంధ్య కూడా ఒకనాటి నటీమణి. తన కుమార్తె పక్కన అపుడే కొత్తగా వచ్చిన హీరో క్రిష్ణ అయితే బాగుంటుంది అని పట్టుబట్టడంతో హీరోగా సెలెక్ట్ చేసిన శోభన్ ని పక్కన పెట్టి మరీ క్రిష్ణకు నిర్మాతలు అవకాశం ఇచ్చారని ప్రచారంలో ఉంది.

ఆ విధంగా శోభన్ హీరోగా సెలెక్ట్ అయిన సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ వేయాల్సివచ్చింది. ఇక 1970 దశకం మాత్రం శోభన్ దే అని చెప్పాలి. ఆయన పట్టిందల్లా బంగారంగా సాగిపోయింది. శోభన్ బాబు సోగ్గాడు వంటి మాస్ మూవీస్ తో కూడా సూపర్ స్టార్ డం సంపాదించుకున్నారు. ఆయన తన మొత్తం కెరీర్ లో 200 కి పైగా సినిమాలు చేశారు. గోల్డెన్ మ్యూజికల్  హిట్స్ అంటే శోభన్ బాబు పాటలే అన్నట్లుగా ఆయన సినిమాలలో సంగీతం ఉంటుంది. తన అరవై ఏటనే రిటరిమెంట్ ప్రకటించి సంచలనం రేపిన శోభన్ 2008 మార్చి 20న దివికేగారు.  ఇక శోభన్ బాబు అన్న పేరు గుర్తుకు రాగానే ఆయన అందాల రూపమే కళ్ల ఎదుట కనిపిస్తుంది. దటీజ్ శోభన్.




లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?

నిమ్మగడ్డతో వైసీపీకి భారీ నష్టమేనా ? టీడీపీకి కలిసొచ్చేది ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>