PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp7c608795-bf68-4f3d-ad76-9a7f3744b454-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp7c608795-bf68-4f3d-ad76-9a7f3744b454-415x250-IndiaHerald.jpgముంజేతి కంకణానికి అద్దమేలా అని ఒక సామెత ఉంది. అన్నీ తెలిసిన వారికి వేరొకరి సలహాలు సంప్రదింపులూ అవసరమా. కానీ రాజకీయాలు మారుతున్నాయి. ఒక బుర్రకు మరో బుర్ర తోడు అయితే బ్రహాండమైన ఫలితాలు వస్తాయని ఆశలు పెరిగిపోతున్నాయి. అవి ఒక్కోసారి హిట్టూ అవవచ్చు. లేక ఫట్టు కూడా అవవచ్చు. tdp;view;shruti;prasanth;sruthi;audi;jagan;2019;industry;tdp;ycp;prashant kishor;partyపీకే శిష్యుడి వ్యూహం ...ఆందోళనలో టీడీపీ ?పీకే శిష్యుడి వ్యూహం ...ఆందోళనలో టీడీపీ ?tdp;view;shruti;prasanth;sruthi;audi;jagan;2019;industry;tdp;ycp;prashant kishor;partyThu, 14 Jan 2021 19:00:00 GMT
తెలుగు రాజకీయాల్లోకి వ్యూహకర్తల కల్చర్ ని తెచ్చింది అచ్చంగా వైసీపీనే. ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ ని తీసుకు వచ్చి తమ పార్టీని అధికారం పీఠం మీద కూర్చోబెట్టుకుంది. పీకే వ్యూహాలు. ఎత్తుగడలకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు బోల్తా కొట్టారు. దాంతో కేవలం 23 సీట్లకే టీడీపీ 2019 ఎన్నికల్లో దిజరాగి దారుణమైన ఓటమిని చవి చూసింది.

ఇక ఆనాడు పీకేని వైసీపీ నియమించుకున్నపుడు మాకు చంద్రబాబు లాంటి గండర గండడు ఉండగా వేరే వ్యూహకర్తలు అవసరం లేదు అంటూ టీడీపీ ఎకసెక్కం ఆడింది. సీన్ కట్ చేస్తే ఇపుడు టీడీపీ కూడా ఒక వ్యూహకర్తను నియమించుకుంది. ఆయనే రాబిన్ శర్మట. ఆయన పీకే టీం లో పనిచేసిన అతి ముఖ్య సభ్యుడు. ఆయన సేవలు అందుకున్న టీడీపీ దాని ప్రకారం కొన్నాళ్ళుగా హిందూత్వ రాగాలు ఆలపిస్తోందంటున్నారు.

అయితే అది మరీ శృతి మించి రాగాన పడిందని అంటున్నారు. రామతీర్ధానికి చంద్రబాబు టూర్ చేయడం వెనక రాబిన్ శర్మ వ్యూహం ఉందని చెబుతున్నారు. అలాగే మతం కార్డుతో జగన్ కి కొడితే ఏపీలో టీడీపీ పుంజుకుంటుందన్న సలహాలు కూడా పీకే శిష్యుడి సలహాలుగా చెబుతున్నారు.  అయితే అదిపుడు వికటించిందని బలమైన లౌకిక ముద్ర ఉన్న టీడీపీ మీద ఇపుడు మైనారిటీలు గుర్రుమంటున్నారని వార్తలు వస్తున్నాయి.

క్రిస్టియన్లు అయితే అసంతృప్తితో ఉంటే ఒక మాజీ ఎమ్మెల్సీ సహా  కొందరు నాయకులు బయటకు వెళ్ళారు. మరో వైపు  ముస్లిం మైనారిటీ నాయకులు కూడా టీడీపీ తాజా పోకడల పట్ల గుస్సాగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ ఎన్నడూ చూడని ఇబ్బందులో పడుతోంది అంటున్నారు. మరి ఇది పీకే శిష్యుడి వ్యూహంగా చెబుతున్నారు. అదే కనుక నిజమైతే మాత్రం వెంటనే ఆ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉందని పార్టీ హితైషులు సూచిస్తున్నారుట.





కువైట్ లోని భారతీయ ఎన్నారై లకు భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది, అంతేకాదు హెచ్చరికలు కూడా జారి చేసింది. భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది పలు దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ నుంచి అరబ్బ్ కంట్రీస్ కి వెళ్ళే వారి

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం తాగొచ్చా?

ఆ ఆలయంలో తలకిందులుగా శివుడు.. తెలుగు రాష్ట్రంలోనే!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. అతనిపై ఎఫ్ఐఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>