EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-nimmagadda-really-has-belief-in-democracy04cb3201-d914-430a-8d18-81949e6c351a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-nimmagadda-really-has-belief-in-democracy04cb3201-d914-430a-8d18-81949e6c351a-415x250-IndiaHerald.jpgతానేదో రాజ్యాంగ పరిరక్షునిగాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అవతరించిన అవతారంగా కబుర్లు చెబుతున్న నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ కోసం చంద్రబాబు హయాంలో ఎందుకని ప్రయత్నించలేదు ? అంటే ముఖ్యమంత్రి మారిపోతే నియమాలు, నిబంధనలు, ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగబద్దమైన విలువలు అన్నీ మారిపోతాయా ? ఎంతసేపు ఎలక్షన్ కమీషన్ రాజ్యాంగబద్దమైన అధికారాలు గల సంస్ధగా చెప్పుకుంటున్న నిమ్మగడ్డకు ఈ విషయం చంద్రబాబు హయాంలో ఎందుకు గుర్తులేదో అర్ధం కావటం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో ఇపుడింత కంపు రేగటానికి కేవలం నిమ్మగడnimmagadda election commission ycp jagan naidu tdp;cbn;kumaar;government;court;chief minister;august;lie;coronavirusహెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రజాస్వామ్యంపై నిమ్మగడ్డకు ఇంత నమ్మకం ఉందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రజాస్వామ్యంపై నిమ్మగడ్డకు ఇంత నమ్మకం ఉందా ?nimmagadda election commission ycp jagan naidu tdp;cbn;kumaar;government;court;chief minister;august;lie;coronavirusThu, 14 Jan 2021 05:00:00 GMT

‘ఎన్నికలు నిలిపేస్తే ..ప్రజాస్వామ్యంపై జనాలకు నమ్మకం పోతుంది’ ఇది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున కమీషన్ లాయర్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు. కమీషన్ తరపున లాయర్ చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే అసలు ఎన్నికలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకం లేనిదే కమీషనర్ నిమ్మగడ్డకు. ఇన్ని వివాదాలకు మూల కారణమైన స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సిందెప్పుడు ? 2018 జూలై-ఆగష్టులో. ఇపుడిన్ని కతలు చెబుతున్న నిమ్మగడ్డ మరపుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు ? అప్పట్లోనే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినా అప్పటి చంద్రబాబునాయుడు కానీ నిమ్మగడ్డ కానీ ఎందుకని ఎన్నికలు నిర్వహించలేదు.



తానేదో రాజ్యాంగ పరిరక్షునిగాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అవతరించిన అవతారంగా కబుర్లు చెబుతున్న నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ కోసం చంద్రబాబు హయాంలో ఎందుకని ప్రయత్నించలేదు ? అంటే ముఖ్యమంత్రి మారిపోతే నియమాలు, నిబంధనలు, ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగబద్దమైన విలువలు అన్నీ మారిపోతాయా ? ఎంతసేపు ఎలక్షన్ కమీషన్ రాజ్యాంగబద్దమైన అధికారాలు గల సంస్ధగా చెప్పుకుంటున్న నిమ్మగడ్డకు ఈ విషయం చంద్రబాబు హయాంలో ఎందుకు గుర్తులేదో అర్ధం కావటం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో ఇపుడింత కంపు రేగటానికి కేవలం నిమ్మగడ్డ మాత్రమే కారణమని జనాలందరు అనుకుంటున్నారు. ప్రధానంగా నిమ్మగడ్డ మూడు తప్పులు చేయటంతోనే ఇపుడింతగ గబ్బు లేస్తోంది.



మొదటిది 2018లోనే ఎన్నికలు పెట్టేసుండాలి. తనంతట తానుగా పెట్టకపోయినా కనీసం కోర్టు ఆదేశించినట్లయినా అప్పట్లోనే ఎన్నికలు నిర్వహించేసుంటే బాగుండేది. సరే అప్పట్లో చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ఎన్నికలు పెట్టలేదని అనుకుందాం. ఇపుడు అంటే మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నపుడు ఏకపక్షంగా వియిదా వేశారు. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేయాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వంతో సంప్రదించుంటే బాగుండేది. మొన్నటి మార్చిలో లేని కరోనా వైరస్ భూతాన్ని చూపించి ఎన్నికలను ఏకపక్షంగా వేసిన నిమ్మగడ్డ వ్యవహారశైలి వల్లే ఇపుడింతగా కంపు జరుగుతోంది. పైగా ఇఫుడు అర్జంటుగా ఎన్నికలు నిర్వహించకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని చెప్పటమే విచిత్రంగా ఉంది.






బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>