Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/samosa-left-from-the-sky-reached-landf59453da-4bdf-4136-ac71-39c32be21768-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/samosa-left-from-the-sky-reached-landf59453da-4bdf-4136-ac71-39c32be21768-415x250-IndiaHerald.jpgమార్కెటింగ్ అనేది ఒక కళ. దానిని ఎంత బాగా ఉపయోగిచుకుంటే బిజినెస్‌ అంతబాగా వృద్ధి చెందుతుంది. అయితే బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తన బిజినెస్‌నే ఆకాశానికి పంపిస్తే.. సరిగ్గా అలాంటి ఆలోచనే వచ్చింది...samosa into space;business;samosa;successఅంతారిక్షానికి సమోసా.. తీరా భూమికి చేరాక..అంతారిక్షానికి సమోసా.. తీరా భూమికి చేరాక..samosa into space;business;samosa;successThu, 14 Jan 2021 14:32:00 GMT
నిజానికి అంతరిక్షంలోకి సమోసాను పంపించాలనే ఆలోచన నీరజ్‌కు కరోనా లాక్‌డౌన్ సమయంలోనే వచ్చిందట. సరదాగా వచ్చిన ఈ ఆలోచన తన బిజినెస్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని నీరజ్‌ భావించాడు. సమోసాని అంతరిక్షంలోకి పంపిస్తే జనాలను ఆకర్షించవచ్చని, తద్వారా తన బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుందని అనుకున్నాడు. ఇంతకుముందు ఇలాంటి ప్రయోగాలు కొన్ని సార్లు చేశాడు. కానీ ప్రతి సారీ నిరాశే ఎదురైంది. కానీ ఈ సారి మాత్రం స్నేహితుల సలహాలు, నిపుణుల సలహాలు తీసుకుని మరీ ప్రయోగం మొదలు పెట్టాడు. ఈ దఫా కచ్చితంగా సక్సెస్ అవుతానని పట్టుదలగా ఉన్నాడు నీరజ్.

తన రెస్టారెంట్‌లో తయారు చేసిన సమోసాని చక్కగా ప్యాక్ చేసి వాటిని రెండు హీలియం బెలూన్లకు కట్టాడు. దానికి ఓ జీపీఎస్ ట్రాకర్, గో-ప్రో కెమెరా ఏర్పాటు చేశాడు. ఎక్కడా ఊడిపోకుండా పటిష్ఠ బందోబస్తు చేశాడు. తర్వాత అందరి ముందు వాటిని వదిలిపెట్టాడు. అలా వదలడమే ఆలస్యం హీలియం బెలూన్లు గాలిలోకి ఎగిరిపోయాయి. ఈ తంతునంతా వీడియో తీసిన నీరజ్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడింది.

సమోసాతో పాటు ఏర్పాటు చేసిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అది ఎక్కడుంతో తెలుసుకోవాలని అనుకున్న నీరజ్‌కు నిరాశే ఎదురైంది. బెలూన్లు గాలిలోకి వెళ్లిన కొద్ది సేపటి నుంచే జీపీఎస్ ట్రాకర్ పనిచేయకుండా పోయింది. దీంతో నీరజ్ బాధపడ్డాడు. కానీ ఓ రోజు తరువాత ట్రాకర్ పనిచేయడం ప్రారంభించింది. దీంతో సమోసా ఫ్రాన్స్‌లోని ఓ అడవిలో ఉన్నట్టు తెలిసింది. నీరజ్ వీడియో చూసిన కొందరు నెటిజనులు ఆ లొకేషన్ ఆధారంగా అడవిలో శోధించి బెలూన్‌తో పాటు జీపీఎస్, గో-ప్రో కెమెరా కనుకొన్నారు. కానీ సమోసా మాత్రం దొరకలేదు.


దోమల్నిచంపి నోట్ బుక్ లో అతికిస్తున్న యువతి వైరల్ అవుతున్న ఫోటోలు

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>