PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kompa-dipping-decision-gubulu-studentse15c393c-9905-456a-936d-23de1b4e66a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kompa-dipping-decision-gubulu-studentse15c393c-9905-456a-936d-23de1b4e66a7-415x250-IndiaHerald.jpgభారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు అమెరికాలో పని చేయాలంటే తప్పనిసరిగా హెచ్‌-1బీ వీసా అవసరం. కొంతకాలంగా ఈ వీసా ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇటీవల హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణ చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానం కాకుండా, అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిబంధనల kompa dipping decision gubulu students;tara;american samoa;degree;qualification;marchకొంప ముంచే నిర్ణయం.. విద్యార్థుల్లో గుబులు..!కొంప ముంచే నిర్ణయం.. విద్యార్థుల్లో గుబులు..!kompa dipping decision gubulu students;tara;american samoa;degree;qualification;marchThu, 14 Jan 2021 13:10:33 GMT
భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు అమెరికాలో పని చేయాలంటే తప్పనిసరిగా హెచ్‌-1బీ వీసా అవసరం. కొంతకాలంగా ఈ వీసా ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇటీవల హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణ చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానం కాకుండా, అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిబంధనల సవరణపై... హోంల్యాండ్‌ సెక్యూరిటీ తుది ప్రకటన చేసింది. దీంతో ఏడాదికి సరిపడా జారీ చేసే...85వేల.. హెచ్‌-1బీ వీసాలను..... వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా ఇవ్వనున్నారు.

కొత్త విధానం వల్ల అందరికీ లాభదాయకమేనని అమెరికా చెబుతున్నా..... విదేశీ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతిభ గల విద్యార్థులు హెచ్‌-1బీ వీసా పొజిషన్స్‌లో లెవల్‌-1కు అర్హులవుతారు. వీరంతా శిక్షణా కాలంలో ఉంటారని, వారిని అత్యధిక వేతనం పొందుతున్న వారిగా పరిగణిస్తామని యూఎస్‌సీఐఎస్‌ చెబుతోంది. అయితే, కేవలం STEM విద్యార్థులు మాత్రమే మూడేళ్ల ఆప్ట్‌ కాలానికి అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ, ఏడాది OPT కాలానికి అర్హత సాధించే విదేశీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు.

అనుభవంతో పాటు మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న కొందరు విద్యార్థులు లెవల్‌-2 పొజిషన్స్‌కు అర్హులైనా కూడా వారు అర్హత సాధించలేకపోవచ్చు. అమెరికాలో చదువుకునాలనుకునే వారిపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు తగ్గుతాయి.

తాజా నిబంధనల ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు మొదటగా యూఎస్‌సీఐఎస్‌ వీసాలు మంజూరు చేస్తుంది. అదే సమయంలో వారి స్థాయిని బట్టి, అత్యధిక నైపుణ్యం ఉన్న వారినీ పరిగణనలోకి తీసుకుంటుంది. వీరంతా లెవల్‌-4 పొజిషన్‌లో ఉంటారు. అక్కడి నుంచి దశల వారీగా లెవల్‌-1 వరకూ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ నిబంధనలు ఈ ఏడాది మార్చి 9 వరకూ అమల్లో ఉంటాయి.




మోనాల్ గజ్జర్ ఫీవర్ మాములుగా లేదుగా....

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>