MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salar88df1952-9357-4b6a-9a14-111d539ec0d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salar88df1952-9357-4b6a-9a14-111d539ec0d1-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడ భాషతో పాటు మిగతా ఇండస్ట్రీల్లోనూ ఏ మేర చరిత్ర సృష్టించిందో చూశాం. ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ కూడా యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 15 కోట్లకు పైగా వ్యూస్‌తో ప్రపంచంలోనే ఏ సినిమా టీజర్‌కుsalar;view;prabhas;pooja hegde;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;yash;india;bollywood;cinema;bahubali;naga aswin;jaan;history;kannada;director;good news;vegetable market;heroine;kgf;prasanth neel;john;good newwz;prashant kishor;chitramప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపే పూజా కార్యక్రమంప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపే పూజా కార్యక్రమంsalar;view;prabhas;pooja hegde;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;yash;india;bollywood;cinema;bahubali;naga aswin;jaan;history;kannada;director;good news;vegetable market;heroine;kgf;prasanth neel;john;good newwz;prashant kishor;chitramThu, 14 Jan 2021 22:38:45 GMTకేజీఎఫ్ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడ భాషతో పాటు మిగతా ఇండస్ట్రీల్లోనూ ఏ మేర చరిత్ర సృష్టించిందో చూశాం. ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ కూడా యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 15 కోట్లకు పైగా వ్యూస్‌తో ప్రపంచంలోనే ఏ సినిమా టీజర్‌కు అందని ఘనతను సంపాదించుకుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సలార్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ద మోస్ట్ వయిలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వయిలెంట్ అనే క్యాప్షన్‌తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. ఇక ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని చిత్ర దర్శకనిర్మాతలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేజీఎఫ్ స్టార్ యష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ అందాల నటి దిశా పటానీ నటిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాకుండా సలార్ సినిమాలో విలన్‌గా కూడా బాలీవుడ్ నటుడే నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్, విలన్‌కు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సలార్ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు బాలీవుడ్‌లోనూ మార్కెట్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ వరుసగా మొత్తం పాన్ ఇండియా చిత్రాలనే చేస్తూ మిగతా తెలుగు హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో, సలార్ చిత్రంలో నటించనున్నాడు. 


చైనా అసలైన మొగుడు ఇండియానే.. నిజం ఒప్పుకున్న అమెరికా..!?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>