PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine6e71a663-cfd4-4ce5-ae83-4f001cbdca77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine6e71a663-cfd4-4ce5-ae83-4f001cbdca77-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం పాకేసి కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 కోట్లకు పైగా కరోనా బారిన పడ్డారు. ఇక ఎంతో కాలం నుంచి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. vaccine;tara;delhi;india;narendra modi;january;prime minister;central government;narendraజనవరి 26న.. ఉదయం.. దేశవ్యాప్తంగా 3 వేల ప్రాంతాల్లో..జనవరి 26న.. ఉదయం.. దేశవ్యాప్తంగా 3 వేల ప్రాంతాల్లో..vaccine;tara;delhi;india;narendra modi;january;prime minister;central government;narendraThu, 14 Jan 2021 22:52:01 GMT
అయితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అయితే ఇంకా మొదలు కాలేదు. దేశం మొత్తం ఒకేసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే పూణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాక్సిన్ బాక్సులు చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ బాక్సులు చేరుకోవడం.. వాటిని అన్ని జిల్లాలకు తరలించడం జరిగిపోయింది. జనవరి 26న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్ లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.

తొలిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో టీకా కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటగా వీరందరికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలన కార్యక్రమం జరగనుంది. ఎక్కడా ఏ ఇబ్బంది తలెత్తకుండా ఆన్ లైన్ ద్వారా అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణలు జరుపుతారు. అంతేకాకుండా నిరంతర ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఓ  ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది


చైనా అసలైన మొగుడు ఇండియానే.. నిజం ఒప్పుకున్న అమెరికా..!?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>