Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/injuries-of-india209c595c-e2a7-4202-9811-bc5aa5bd7004-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/injuries-of-india209c595c-e2a7-4202-9811-bc5aa5bd7004-415x250-IndiaHerald.jpgషమి, ఉమేశ్, బుమ్రా, రాహుల్, మయాంక్ అగర్వాల్, పంత్, జడేజా, విహారి, పుజారా, అశ్విన్ ఇదంతా టీమిండియా తదుపరి మ్యాచ్ ఆటగాళ్ల లిస్ట్ కాదు.. ఇప్పటివరకు గాయాలపాలై టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టిన భారత ఆటగాళ్ల లిస్ట్. ఒక్క టీమిండియానే..injuries of india;rahul new;rahul;k l rahul;ravindra jadeja;australia;naga aswin;rishabh pant;rahul sipligunj;mayank agarwalఆసీస్‌టూర్‌ను ‘దెబ్బ’తీసిన ఐపీఎల్..? అందుకే ఆటగాళ్లంతా..ఆసీస్‌టూర్‌ను ‘దెబ్బ’తీసిన ఐపీఎల్..? అందుకే ఆటగాళ్లంతా..injuries of india;rahul new;rahul;k l rahul;ravindra jadeja;australia;naga aswin;rishabh pant;rahul sipligunj;mayank agarwalThu, 14 Jan 2021 10:00:00 GMTరాహుల్, మయాంక్ అగర్వాల్, పంత్, జడేజా, విహారి, పుజారా, అశ్విన్ ఇదంతా టీమిండియా తదుపరి మ్యాచ్ ఆటగాళ్ల లిస్ట్ కాదు.. ఇప్పటివరకు గాయాలపాలై టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టిన భారత ఆటగాళ్ల లిస్ట్. ఒక్క టీమిండియానే కాదు గాయాల దెబ్బకు ఆసీస్ కూడా విలవిల్లాడుతోంది.

 ఇప్పటికే ఆ జట్టులో కీలక ఆటగాళ్లు చాలా మంది గాయాల కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే ఏ టోర్నీలో లేనంతగా ఈ సారి మాత్రమే ఆటగాళ్లు అత్యధికంగా గాయాల పాలవడానికి కారణమేంటని ప్రశ్నిస్తే.. ఐసీఎల్ 13వ సీజన్ వల్లే ఇదంతా జరుగుతున్నట్లు ఆసీస్ అభిప్రాయపడుతోంది.

ఆటగాళ్ల గాయాలపై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. సిరీస్‌లో వెలుగు చూస్తున్న గాయాలకు ఐపీఎల్ కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు అంతా ఇప్పటికే దాదాపు గాయాలపాలైందని, ఇరు జట్లకు సంబంధించిన చాలా మంది ఆటగాళ్లు ఈ గాయాల వల్ల సిరీస్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిందని లాంగర్ చెప్పాడు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్.. ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపి ఉండొచ్చని లాంగర్స్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఐపీఎల్ జరిగిన టైమింగ్ సరిగా లేదని అనుకుంటున్నా. ప్రస్తుతం మనం చూస్తున్న గాయాలపై దాని ప్రభావం ఉందేమో అని భావిస్తున్నా’’ అని లాంగర్స్ పేర్కొన్నాడు. లాంగర్స్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద దుమారమే రేపుతోంది.

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఆ తరువాత టోర్నీకే పూర్తిగా దూరమయ్యాడు. అయితే ఆసీస్ ఓటమి నుంచి బయటపడాలనే ఆలోచనతో పూర్తిగా కోలుకోకుండానే అతడిని తిరిగి జట్టులోకి తెచ్చినా వార్నర్ ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. వార్నర్ మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది ఆటగాళ్లు గాయాల కారణంగా ఆసీస్ జట్టు నుంచి వైదొలిగారు.


వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>