PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-americae6d876e9-d960-49dc-aa6b-e349d4068e16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-americae6d876e9-d960-49dc-aa6b-e349d4068e16-415x250-IndiaHerald.jpgఎలాగైనా ప్రపంచ నెంబర్‌ వన్ కావాలి..ఇదీ చైనా టార్గెట్.. అందుకే అది అందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. దేన్నీవదలదడం లేదు. గాలి, నీరు, ఆకాశం.. ఇలా పంచభూతాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భూతల, సముద్రతల, గగనతల, అంతరిక్ష, ఎలక్ట్రోమేగ్నటిక్‌ సీమల్లో చైనాకు ఎదురుకాగల సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు చైనా కొత్త టార్గెట్ ఏంటో తెలుసా.. 2027 కల్లా చైనాను నెంబర్ వన్ చేయాలి. మరి ఎందుకు 2027 టార్గెట్‌గా పెట్టుకున్నారు. దానికీ కారణం ఉంది. ప్రజా విమోచన సైన్యం.. పీఎల్‌china-america;american samoa;donald trump;2020;air;army;masterషాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?china-america;american samoa;donald trump;2020;air;army;masterThu, 14 Jan 2021 07:00:00 GMTగాలి, నీరు, ఆకాశం.. ఇలా పంచభూతాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భూతల, సముద్రతల, గగనతల, అంతరిక్ష, ఎలక్ట్రోమేగ్నటిక్‌ సీమల్లో చైనాకు ఎదురుకాగల సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు చైనా కొత్త టార్గెట్ ఏంటో తెలుసా.. 2027 కల్లా చైనాను నెంబర్ వన్ చేయాలి.

మరి ఎందుకు 2027 టార్గెట్‌గా పెట్టుకున్నారు. దానికీ కారణం ఉంది. ప్రజా విమోచన సైన్యం.. పీఎల్‌ఏ ఆవిర్భవించి అప్పటికి వందేళ్లవుతాయి. అందుకే ఆ ఏడాదిని లక్ష్యంగా పెట్టుకుంది. ఆలోగా స్వదేశంలో, విదేశాల్లో చైనా ప్రయోజనాలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.  కొత్త ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తి, సైబర్‌ భద్రత, అంతరిక్ష సీమల్లో నవ్య ఆవిష్కరణలకు ఊపిరిపోస్తోంది.

నెంబర్ వన్ గా నిలవడం అంత ఈజీ కాదన్న సంగతి చైనాకూ తెలుసు. అందుకే ముందు సైన్యాన్ని మరింత పటిష్టం చేస్తోంది. 2027 కల్లా పీఎల్‌ఏని పూర్తిగా ఆధునిక సైన్యంగా మలచేందుకు ప్రయత్నిస్తోంది.  సముద్ర జలాల్లో ఎంత దూరమైనా పయనించి పోరాడగల బలగంగా నౌకాదళాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం విమాన వాహక యుద్ధ నౌకలు కూడా సమకూర్చుకుంటున్నారు.

అంతే కాదు.. ఆకాశంలో పోరుకు ఆధునిక యుద్ధ విమానాలు, ఉపగ్రహ విధ్వంస క్షిపణులు చైనా రెడీ చేసుకుంటోంది. నింగి, నేలపై ఎక్కడ, ఎప్పుడు పోరాటం జరిగినా నెగ్గాలన్నదే చైనా టార్గెట్. అమెరికాను అన్ని విధాలుగా అధిగమించి తానే అగ్రరాజ్యంగా ఎదగాలన్నది చైనా చిరకాల స్వప్నం. కల కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి పట్టుదలగా కృషి చేస్తోంది. దీనికి కాలమూ కలిసివస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక, 2020లో కరోనా వైరస్‌ విజృంభణ- చైనా అగ్రరాజ్యంగా ఎదగడానికి పునాదిని ఏర్పరచాయి. 2008, 2020 సంక్షోభాల నుంచి చెక్కుచెదరకుండా బయటపడిన చైనా ఈ దశాబ్దం ముగిసే లోపలే జీడీపీలో అమెరికాను మించనుంది.


ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీతోనే తలనొప్పి ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>