PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆయ‌న‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి కూడా మంజూరు చేసింది. పోలీసులు కూడా ర‌క్ష‌ణగా చంద్ర‌బాబును తీసుకువె ళ్లారు. అయితే.. ఇదే ప్రాంతానికి వెళ్లి.. ప‌రిస్థితి స‌మీక్షించాల‌ని భావించిన బీజేపీ ఏపీ సార‌థి.. సోము వీర్రాజుకు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు నుంచి అనుమ‌తి రాలేదు. దీంతో బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యం ఆరా తీస్తే.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాసే ఉన్నార‌ని. ఆయ‌న వ‌ద్ద‌ని చెప్ప‌డంతోనే బీజేపీ నేత‌ల‌ను అక్క‌డ‌కు అనుమ‌తించ‌డం లేద‌ని.. బీజేపీ నేత‌ల‌కు bjp;view;ramu;srinivas;vishnu;delhi;bharatiya janata party;somu veerraju;andhra pradesh;police;minister;letter;tdp;central governmentఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?bjp;view;ramu;srinivas;vishnu;delhi;bharatiya janata party;somu veerraju;andhra pradesh;police;minister;letter;tdp;central governmentThu, 14 Jan 2021 10:00:00 GMTమంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ టార్గెట్‌గా బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. తాజాగా ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి.. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి, తెలంగాణ‌కు చెందిన బీజేపీ కీల‌క నేత‌.. కిష‌న్‌రెడ్డితో దాదాపు రెండు గంట‌ల‌కు పైగా భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న దేవాల‌యాల‌పై దాడుల‌ను ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తావించారు. అంతేకాదు.. ఈ సమ‌యంలో రాష్ట్ర మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌పైనా ఆయ‌న ఫిర్యాదులు చేసిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌ధానంగా రామ‌తీర్థంలో రాముల వారి విగ్ర‌హానికి త‌ల‌న‌రికేయ‌డం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ ఆల‌యాన్ని ద‌ర్శించి, ప‌రిస్థితిని రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు రామ‌తీర్థం వెళ్లారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి కూడా మంజూరు చేసింది. పోలీసులు కూడా ర‌క్ష‌ణగా చంద్ర‌బాబును తీసుకువె ళ్లారు. అయితే.. ఇదే ప్రాంతానికి వెళ్లి.. ప‌రిస్థితి స‌మీక్షించాల‌ని భావించిన బీజేపీ ఏపీ సార‌థి.. సోము వీర్రాజుకు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు నుంచి అనుమ‌తి రాలేదు.

దీంతో బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యం ఆరా తీస్తే.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాసే ఉన్నార‌ని. ఆయ‌న వ‌ద్ద‌ని చెప్ప‌డంతోనే బీజేపీ నేత‌ల‌ను అక్క‌డ‌కు అనుమ‌తించ‌డం లేద‌ని.. బీజేపీ నేత‌ల‌కు ఉప్పందింది. దీంతో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి నేరుగా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిని క‌లిసి వెల్లంప‌ల్లిపై ఫిర్యాదు చేశార‌ని అంటున్నారు.

గ‌తంలో బీజేపీ ఉప్పు తిన్నాడ‌ని, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున ఆయ‌న‌కు మ‌నం టికెట్ కూడా ఇచ్చామ‌ని. అయినా.. కొంచెం కూడా విశ్వాసం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌పై ఎలాగైనా ఒత్తిడి తెచ్చి వెల్లంప‌ల్లిని బ‌ర్త‌ర‌ఫ్ చేయించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను కిష‌న్ రెడ్డిముందు ఉంచార‌ని అంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని బీజేపీ నేత‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.




వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>