MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab8038e046-b372-4eb6-8767-c5a29f1f9826-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab8038e046-b372-4eb6-8767-c5a29f1f9826-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2018లో అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో మళ్లీ ఆనందం పుట్టుకొచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోందిvakeelsaab;pawan;amitabh bachchan;harish shankar;kranthi;kranti;pawan kalyan;shankar;makar sakranti;cinema;sankranthi;court;history;hindi;remake;director;fort;pink;agnyaathavaasi;gabbar singhగబ్బర్ సింగ్ హిస్టరీ వకీల్ సాబ్‌తో రిపీట్ అవ్వనుందా?గబ్బర్ సింగ్ హిస్టరీ వకీల్ సాబ్‌తో రిపీట్ అవ్వనుందా?vakeelsaab;pawan;amitabh bachchan;harish shankar;kranthi;kranti;pawan kalyan;shankar;makar sakranti;cinema;sankranthi;court;history;hindi;remake;director;fort;pink;agnyaathavaasi;gabbar singhThu, 14 Jan 2021 22:01:52 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2018లో అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో మళ్లీ ఆనందం పుట్టుకొచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. విడుదలైన మూడు గంటల్లోనే ముప్పై లక్షల మంది ఈ టీజర్‌ను చూడగా.. ఆరు లక్షల మంది టీజర్‌ను లైక్ చేశారు. టీజర్‌ను గమనిస్తే పవన్ కల్యాణ్ ఇంటెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నట్టు అర్థమవుతోంది. కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ వచ్చే డైలాగ్ పవన్ కల్యాణ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫైట్లు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రోలో ఓ ఫైట్ సీన్ ఉన్నట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. వకీల్ సాబ్ హిందీ చిత్రం పింక్ రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి హిందీలో అమితాబ్ బచ్చన్ మెయిన్ క్యారెక్టర్‌లో నటించగా.. ఆయన ఎటువంటి ఫైట్లు చేయడం ఉండదు. కానీ.. తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి డైరెక్టర్ పూర్తిగా స్వేచ్చ తీసుకుని పవన్ కల్యాణ్‌కు తగ్గట్టు స్టోరీని మార్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా గబ్బర్ సింగ్ సినిమా సమయంలోనూ ఇదే జరిగింది.

ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్‌కు తగ్గట్టు మార్చారు. గబ్బర్ సింగ్ సినిమా ఏ విధంగా చరిత్ర సృష్టించిందో అందరం చూశాం. ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలోనూ అదే జరుగుతుందని పవన్ కల్యాణ్ అభిమానులు అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా గబ్బర్ సింగ్ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని.. తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డును సాధిస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వకీల్ సాబ్‌ సినిమా పవన్ కల్యాణ్‌కు మంచి హిట్‌ను అందించాలని మనం కూడా కోరుకుందాం.  


ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం తాగొచ్చా?

ఆ ఆలయంలో తలకిందులుగా శివుడు.. తెలుగు రాష్ట్రంలోనే!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. అతనిపై ఎఫ్ఐఆర్?

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>