Businessyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/bit-coin415f6f35-be3a-45a1-8e2f-6f941a4bd0ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/bit-coin415f6f35-be3a-45a1-8e2f-6f941a4bd0ea-415x250-IndiaHerald.jpg ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏది అనగానే కువైట్ దినార్ అని ఠక్కున చెబుతారు. కానీ ఆ సమాధానం తప్పు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ. ఎక్కడో వేలల్లో పుట్టి ఇప్పుడు వేల డాలర్లకు చేరుకుంది దీని విలువ. ఫిజికల్‌గా ఎటువంటి రూపం లేని ఈ బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్ మొత్తం ..bit coin;raghu;ram pothineni;tara;delhi;tesla;india;reserve bank of india;bank;governor;vegetable market;currencyబిట్ కాయిన్ కాదు.. ఓ బుడగ... పగిలిపోవడం ఖాయం.. రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలుబిట్ కాయిన్ కాదు.. ఓ బుడగ... పగిలిపోవడం ఖాయం.. రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలుbit coin;raghu;ram pothineni;tara;delhi;tesla;india;reserve bank of india;bank;governor;vegetable market;currencyThu, 14 Jan 2021 22:51:34 GMTన్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏది అనగానే కువైట్ దినార్ అని ఠక్కున చెబుతారు. కానీ ఆ సమాధానం తప్పు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ. ఎక్కడో వేలల్లో పుట్టి ఇప్పుడు వేల డాలర్లకు చేరుకుంది దీని విలువ. ఫిజికల్‌గా ఎటువంటి రూపం లేని ఈ బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది సాధారణ ప్రజలను కోటీశ్వరులను చేసిందీ బిట్‌కాయిన్. ఇప్పటికీ దీని విలువ పెరుగుతూనే ఉంది. అయితే ఈ విధంగా విలువ పెరుగుతుండడంపై bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ చానెల్‌కు బుధవారం ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో భారత్‌లోని బిట్‌కాయిన్ మదుపర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరుగుతోందని, అయితే ఇది దీర్ఘకాలిక పెరుగుదల కాదని ఆయన బాంబు పేల్చారు. బిట్‌కాయిన్ విలువ పెరుగుదలను ఓ బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణగా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి. గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ ఇప్పుడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది.

వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. అయినా కానీ బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు. అందుకే బిట్ కాయిన్‌‌పై నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఈ వైఖరి బుడగ లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా అకస్మాత్తుగా పగిలిపోతుంది’ అంటూ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం గురించి, భారతీయ ప్రజల ఆర్థిక స్థితిని గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కార్ల తయారీ రంగంటో టెస్లా దూసుకుపోతోందని, టొయోటా, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలకు టెస్లా గట్టి పోటీ ఇస్తుందని ఆయనన్నారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బ తిందని, అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఆయన్నారు.


చైనా అసలైన మొగుడు ఇండియానే.. నిజం ఒప్పుకున్న అమెరికా..!?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>